టీవీ షో: రొమాంటిక్ సినిమాలపై చంద్రబాబు స్పందన అదే.!

FARMANULLA SHAIK
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే దేశ వ్యాప్తంగా ఈ షో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. అయితే ఇప్పటికే మూడు సీజన్లు పూర్తయ్యాయి.  ఇప్పుడు నాల్గో సీజన్‌ ప్రారంభమైంది.ఈ సీజన్‌ చంద్రబాబు నాయుడు ఫస్ట్ గెస్ట్ గా కావటం విశేషం.ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ నిన్న రాత్రి ఆహా లో స్ట్రీమింగ్ అయింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు, బాలయ్య మధ్య పలు ఆసక్తికర విషయాలు జరిగాయి. వాటిలో ముఖ్యంగా బాలయ్య, చంద్రబాబు ని రొమాంటిక్ మూవీస్ గురించి చెప్పమనటం ఆసక్తికరం గా మారింది. దానిపై చంద్రబాబు స్పందన ఏ విధంగా వుందో తెలుసుకుందాం.రొమాంటిక్ సినిమాలా.. కామెడీ చిత్రాలా అంటూ చంద్రబాబు నాయుడుకు ఓ ఫొటో చూపించారు బాలకృష్ణ. తీరిక సమయాల్లో ఎలాంటి చిత్రాలు చూసేందుకు ఇష్టపడతారని ప్రశ్న అడిగారు. దీనికి చంద్రబాబు స్పందించారు. “ఎవరేమన్నా బాలకృష్ణ నటించిన రొమాంటిక్ సినిమాలు అప్పుడప్పుడు చూస్తే” అంటూ ఆయన నవ్వారు. “బాలకృష్ణ దగ్గరి నుంచి కొన్ని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు దగ్గరి నుంచి కొన్ని కోరుకుంటారు. డిఫరెన్స్ ఉంటుంది” అని చంద్రబాబు అన్నారు.
వీలున్నప్పుడు బాలకృష్ణ సినిమాలు చూసి రిలాక్స్ అవుతానని చంద్రబాబు చెప్పారు.మా చెల్లెలితో రొమాంటిక్ సినిమా చూసింది ఒకటి చెప్పండి అని బాలకృష్ణ అడిగారు. నువ్వు క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చాలా సమస్యలు వస్తాయి అని చంద్రబాబు సరదాగా అన్నారు. “ఒక్కోసారి నాకు టైమ్ తక్కువగా ఉన్నప్పుడు నా భార్యతో కలిసి కూర్చొని నవ్వుతూ నీ సినిమాలు చూస్తే రిలాక్సియేషన్‍గా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్‌ను సపోర్ట్ చేసినట్టు కూాడా కొంత అవుతుంది. రెండు పనులు అవుతాయి” అని చంద్రబాబు చెప్పారు. స్టార్ క్రికెటర్లుగా ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల్లో ఎవరు ఇష్టం అని అడుగగా.. కోహ్లీనే తాను ప్రిఫర్ చేస్తానని చంద్రబాబు చెప్పారు.ఇదిలావుండగా ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.రెండేళ్ల క్రితం అన్‍స్టాపబుల్ రెండో సీజన్ తొలి ఎపిసోడ్‍కు కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు. అప్పుడు ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్‍కు ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: