టీవీ: బుల్లితెరపై కూడా క్యాస్టింగ్ కౌచ్.. నటి రాగిణి కామెంట్స్..!

Divya
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంబంధించి ఎన్నో వార్తలు రోజుకొకటి హాట్ టాపిక్ ఆ మారుతూ ఉన్నాయి.. బాలీవుడ్ లో ఇటీవలే చాలామంది యాక్టర్స్ పేర్లు లీక్ అవుతూ ఒక సంచలనంగా మారింది. చాలా ఇండస్ట్రీలలో మీటు ఉద్యమం రావడంతో కొంతమేరకు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడేవారి సంఖ్య తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మీటు ఉద్యమాన్ని టాప్ హీరోయిన్స్ కాకంటే చిన్న నటిమనులే చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు.

అయితే ఇప్పుడు మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి నివేదిక ఇవ్వడంతో అన్ని ఇండస్ట్రీలు అలా చేయాలనే విధంగా చాలామంది సెలబ్రిటీలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలోనే బుల్లితెర నటిగా పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి రాగిణి తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గతంలో తెలియజేసింది. ముఖ్యంగా వెండితెర పైనే కాదు బుల్లితెర పైన కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదనే విధంగా గతంలో తెలియజేసింది.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ రాగిణి తన పర్సనల్ లైఫ్ విషయాలపై ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తెలియజేస్తూ.. నటిగా రాణించాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే.. సినిమా అవకాశాలు చాలానే వచ్చిన కొన్ని కారణాల చేత సినిమాల్లో ఎక్కువగా నటించలేకపోయారని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో  తెలిసిన వాళ్లనే బాగున్నావా అని అడిగితే చాలు పైనుంచి కింద వరకు చూసి వస్తావా అని డైరెక్ట్ గానే అడుగుతారని..  చాలామంది అడిగారని అప్పుడు చాలా బాధ కలిగింది అంటూ తెలియజేసింది రాగిణి. ఇండస్ట్రీలో గుర్తింపు రావడం కోసం చాలానే కష్టపడ్డానని.. తన పర్సనల్ లైఫ్ లో కూడా తన భర్త చాలా రకాలుగా హింసించేవారని.. 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తనకు వివాహం చేశారని.. ఒక ఏడాది పాటు కలిసుండడంతో తనకు ఒక బాబు కూడా జన్మించారనీ.. కానీ సినీమా  ఫీల్డ్ అంటే ఒక చెత్త తిరుగుడు తిరిగే అలవాటు ఉంటుందని తన భర్తకు తనని హింసించే వారిని తెలిపింది.. చివరికి తన భర్త నుంచి కూడా తాను దూరం అయ్యారని తెలిపింది రాగిణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: