టీవీ: బిగ్ బాస్ కు ట్విస్ట్ ఇచ్చిన మొగలి రేకులు సీరియల్ నటుడు..!

Divya
బిగ్ బాస్ -8 కొత్త సీజన్ ప్రారంభం మరి కొద్ది రోజులలో కాబోతోంది.. సెప్టెంబర్ 1న మొదలు కాబోతోందట. ఇప్పటికే కొత్త సీజన్ కి సంబంధించి అంచనాలను మేకర్స్ వీడియోల ద్వారానే హైప్ పెంచేస్తున్నారు.. మరొకవైపు కంటిస్టేన్స్  ఎవరనే విషయం పైన ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే చాలా మంది పేర్లు అయితే వినిపించాయి. అయితే ఇందులో ఎవరు వస్తారు అనే విషయంపై బిగ్ బాస్ లాంచ్ అయ్యేవరకు చెప్పలేని పరిస్థితి.. అయితే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో మొగలిరేకులు సీరియల్ నటుడుగా పేరుపొందిన ఇంద్రనీల్ వర్మ ఉండబోతున్నారని వార్తలు వినిపించాయి.

దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అయిన కానీ సడన్గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదంటూ ఒక సడన్ ట్విస్ట్ ఇచ్చారు.. అయితే తాను హౌస్ కి సెలక్ట్ అయ్యానని ఇంటర్వ్యూలకు కూడా వెళ్లానని కానీ తాను మాత్రం హౌస్ లోకి వెళ్ళనంటూ తెలియజేశారు. అందుకు గల కారణాన్ని కూడా ఇంద్రనీల్ వివరిస్తూ.. తనని అభిమానించే తన ఫ్యాన్స్ కి తాను చెప్పాలనుకున్నది ఒకటే.. తాను హౌస్ లోకి వెళ్లడం లేదు ఈ విషయం తనకు టీం కాల్ చేసినప్పుడు కూడా చెప్పానని తెలిపారు.

తనకు ఇంట్రెస్ట్ లేదని సూటిగానే తెలియజేశానని.. ఈ విషయం చెప్పేటప్పుడు తన భార్య మేఘన కూడ తన పక్కనే ఉందని కానీ వాళ్ళు.. ఒక ఇంటర్వ్యూకి రమ్మని అడిగారు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పగా.. సరే అని వెళ్లాను.. కానీ చాలా ప్రశ్నలు అడిగారు అవి తనకు చాలా విచిత్రంగా అనిపించాయి అంటూ తెలియజేశారు. అయితే షోకి సంబంధించిన విషయాలు అడిగారు తనకు తెలిసిన సమాధానాలు అయితే తెలిపాను కానీ రెండు వారాల తర్వాత మళ్లీ ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ముంబై టీమ్ ఇంటర్వ్యూ చేసిందని తెలిపారు.. బిగ్బాస్ అనేది అప్కమింగ్ ఆర్టిస్టులకు చాలా హెల్ప్ అవుతుందని తెలిపారు. తాను చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ.. హౌస్ లోకి వెళ్లిన తర్వాత చాలా గొడవలు ఉంటాయి, నామినేషన్ సమయంలో అప్గ్రేసివ్ గా ఉండాలి చాలా ఫైట్ చేస్తూ ఉండాలి ఇవన్నీ ఊహించుకుంటే భయమేసింది అందుకే హౌస్ లోకి వెళ్లకూడదని క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: