బ్రహ్మముడి సీరియల్ రుద్రాణి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్..!

Divya
ఇటీవల కాలంలో సీరియల్స్ లో నటీనటుల హవా ఎక్కువ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సీరియల్స్ లో కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను దింపుతూ భారీ పాపులారిటీ తోపాటు సీరియల్ కి మంచి టిఆర్పి రేటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సీరియల్స్ నిర్వాహకులు. అందులో భాగంగానే తల్లి కూతుర్ల మధ్య వయసు తేడా లేకుండా పోతోంది. ఇక చాలామంది అవకాశాలు రాక తల్లి, అత్త క్యారెక్టర్లకి కూడా ఓకే చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే కూతురు వయసు కంటే తల్లి వయసు తక్కువగా ఉండడం ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇకపోతే బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ హీరోయిన్ వయసుతో పోటీ పడుతూ అత్త క్యారెక్టర్ లో అదరగొట్టేస్తోంది రుద్రాణి. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆస్తి మొత్తం తన కొడుకుకే రావాలి అని పోరాడుతూ.. సీరియల్ హీరో హీరోయిన్ తో గొడవ పడుతూ మంచి పేరు దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఈ సీరియల్ లో విలన్ పాత్ర చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రోజుకు ఎంత పారితోషకం  తీసుకుంటుంది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
నెలలో 25 రోజులపాటు సీరియల్ షూటింగ్ జరుగుతుంది.. రోజుకి రూ .15000 చొప్పున మొత్తంగా నెలకి 5 లక్షల రూపాయలు రుద్రాణి పారితోషకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి నెలకు రూ .5 లక్షలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక ఈమె అసలు పేరు షర్మిత గౌడ . చిక్మగలూర్ కిచెందిన ఈమె  1985లో జన్మించింది. బయో కెమిస్ట్రీ పూర్తి చేసిన ఈమె 2008లో కేదార్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. న్యూట్రిషన్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత మోడల్ గా మారి ఇప్పుడు నటిగా దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: