టీవీ: లీలాతో కొత్త ప్రయాణం మొదలుపెట్టిన బిగ్ బాస్ షణ్ముఖ్..!

Divya
బిగ్ బాస్ రన్నర్ షణ్ముఖ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ లతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అలాగే యూట్యూబర్ గా కూడా ఒక సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఏకంగా హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు షణ్ముఖ్. తాజాగా లీలా అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ రోజున ఫిలింనగర్లలో జరిగాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు షణ్ముఖ్.

 ఈ వెబ్ సిరీస్ థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటి లోనే రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వరుస వివాదాలతో కెరియర్ను గందరగోళంలో పడేసుకున్న షణ్ముఖ్ ..లీలా తో సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. యూట్యూబర్గా మొదట తన కెరీర్ ని ప్రారంభించిన షణ్ముఖ బిగ్ బాస్ షో తో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా దీప్తి సునయనతో కలిసి ప్రేమాయణం నడపడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత బ్రేకప్ కూడా చెప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో వివాదంలో చిక్కుకున్నారు. అదే గంజాయి కేసులో షణ్ముఖ్ తో పాటు అతని సోదరుడు చిక్కడంతో షణ్ముఖ కెరియర్ క్లోజ్ అయినట్టుగా చాలా మంది భావించారు. అంతేకాకుండా షణ్ముఖతో పాటు తన సోదరుడు సంపత్ ను కూడా పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా కొద్దిరోజులు జైలులో కూడా ఉంచారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి సమయంలోనే అనూహ్యంగా అవకాశాలు రావడంతో షణ్ముఖ్ కు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే లీలా అనే వెబ్ సిరీస్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి హీరోగా ట్రై చేస్తున్న ఈ సినిమా ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: