టీవీ: ఈ యాంకర్ వల్ల టాలివుడ్ స్టార్ డైరెక్టర్ పెళ్లి అయ్యిందని తెలుసా..?

Divya
తెలుగు బుల్లి తెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ ఝాన్సీ.. ఝాన్సీ యాంకర్ గానే కాకుండా పలు సినిమాలలో కూడా మంచి మంచి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించింది. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన ఝాన్సీ ఇటీవల కాలంలో తక్కువ సినిమాలలో నటిస్తోంది. యాంకర్ ఝాన్సీ వల్లే.. టాలీవుడ్ లో ఒక స్టార్ డైరెక్టర్ వివాహం అయ్యిందట. వాటి గురించి తెలుసుకుందాం..

టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చిన ఘనత ఈ డైరెక్టర్ కి ఉన్నది. ఇలాంటి పూరి జగన్నాథ్ పెళ్లి చేసుకొనే సమయంలో తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని కేవలం యాంకర్ ఝాన్సీ వల్లే తన పెళ్లి జరిగిందని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. అసలు విషయంలోకి వెళ్తే నాగార్జున నటిస్తున్న నిన్నే పెళ్ళాడుతా అనే సినిమా చేస్తున్న సమయంలో పూరీ జగన్నాథ్ లావణ్యతో పరిచయం ఏర్పడిందట.

అపరిచయాన్ని ప్రేమగా మార్చి ఇంట్లో ఇబ్బందులు పెట్టడంతో తక్కువ సమయంలోనే లావణ్యని పెళ్లి చేసుకోవలసి వచ్చిందట. ఆ సమయంలో పూరి జగన్నాథ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని.. దీంతో పూరి జగన్నాథ్ బాగా తెలిసిన వారు కొంతమంది సహాయం చేశారని అందులో యాంకర్ ఝాన్సీ కూడా ఒకరిని.. ఈమె ముఖ్యంగా పూరి జగన్నాథ్ కి మంచి స్నేహితురాలు అలా ఝాన్సీ వీరి పెళ్లికి తాళిబొట్టు కొనిచ్చిందట.. మరో నటి హేమ వీరిద్దరి పెళ్లికి సంబంధించిన పెళ్లి వస్త్రాలను కూడా కొనిచ్చిందని అలాగే మరి కొంతమంది స్నేహితులు కూడా పూరి, లావణ్య పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలకు సొంత డబ్బులు పెట్టి మరి దగ్గరుండి చేయించారట. అలా తన పెళ్లి జరుగుతుందని అసలు ఎప్పుడు ఊహించలేదని ఒక ఇంటర్వ్యూలు వెల్లడించారు పూరి జగన్నాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: