టీవీ: అదృష్టం అంటే బుల్లితెర హాట్ బ్యూటీదే..ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్..!!

Divya
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతి రాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. సీరియల్స్ లో ఈమె తల్లి పాత్రలో కనిపించింది. జగతి అనే పాత్రలో చాలా ఎమోషనల్ గా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ పాపులారిటీతోనే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని స్కిన్ షోతో హాట్ ఫోటోలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. దీంతో ఇటీవలే పలు వెబ్ సిరీస్లలో కూడా నటించే అవకాశాలు అందుకుంది.. బుల్లితెరపై ఎన్నో మంచి పాత్రలు చేసినప్పటికీ రియల్ లైఫ్ లో బోల్డ్ గా కనిపిస్తూ ఉంటుంది.

ఈమెకు వివాహమైనప్పటికీ భర్తకు విడాకులు ఇచ్చి మరి ఒక డైరెక్టర్ తో సహజీవనం చేస్తోంది. మరొక పక్క తనకి ఉన్న ఇమేజ్ను సైతం ఉపయోగించుకుంటూ గ్లామర్ ఫోటో షూట్లతో భారీగానే అవకాశాలను అందుకుంటోంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక సినిమాలో అవకాశాన్ని అందుకుంది. అది కూడా ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో  వస్తున్న సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు..ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇది వరకే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా రావడం జరిగింది. ఇందులో ఒక మంచి పాత్ర కోసం జ్యోతి రాయ్ కి డైరెక్టర్ డిజైన్ చేసినట్లు సమాచారం. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలో నటించే ఫిమేల్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉంటుంది. కేజిఎఫ్ లో కూడా రవీనా టాండన్, సలార్ సినిమాలో ఝాన్సీ శ్రీయా రెడ్డి తదితరులు నటించారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే జ్యోతి రాయ్ దశ తిరిగిపోయినట్టే అంటూ అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా ప్రశాంత నీల్, ఎన్టీఆర్ ఫోటోలను కూడా స్టోరీలలో షేర్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: