టీవీ: అమరదీప్-తేజ పెళ్లిలో ఇంత ట్విస్ట్ ఉందా..!!

Divya
బుల్లితెర నటీనటులుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అమరదీప్ చౌదరి-తేజస్విని గౌడ కూడ ఒకరిని చెప్పవచ్చు. తేజస్విని కన్నడ సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి అయినప్పటికీ అమర్ మాత్రం తెలుగు వారే కావడం గమనార్హం. ఇలా వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో ఎంతో పేరు సంపాదించుకున్నారు. నిజజీవితంలో కూడా ఈ జంట ఒక్కటైన సంగతి అందరికీ తెలిసిందే..వీరిద్దరి నిశ్చితార్థం జరుపుకోగానే అభిమానులు నేటిజన్స్ ప్రేమ వివాహమని భావించడం జరిగింది. కానీ వీరిది మాత్రం పెద్దలు కుదిరిచిన వివాహం అని అమర్ తేజ్ ఎన్నో సందర్భాలలో తెలిపారు.

సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న  అమర్.. తాజాగా బిగ్ బాస్-7 లో  కంటిస్టెంట్ గా పాల్గొన్నా అమర్ మొదటి నాలుగు వారాలకి ఆటపైన ఫోకస్ పెట్టని అమర్ ప్రస్తుతం భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. తన ఆట తీరుతో ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం ఈయన టైటిల్ రేసులో కూడా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తేజ- అమర్ వివాహం కావడానికి ముఖ్య కారణం బిగ్ బాస్ అంటూ తేజ చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. వీరి పెళ్లికి బిగ్ బాస్ కి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే బిగ్ బాస్ కార్యక్రమం స్టార్ మా లో ప్రసారమవుతూ ఉన్నది. వన్డే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు సైతం ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది. అందులో అమర్- తేజ ఇద్దరు కూడా ఇందులో పాల్గొన్నారు. అప్పటికే వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని అయితే ఆ షో తర్వాత లేట్ కావడంతో అమర్ తనని డ్రాప్ చేస్తానని చెప్పారట. అలా ఆరోజు అమర్ తనని డ్రాప్ చేయడంతో అప్పటినుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి ఈ అమ్మాయి భార్యగా వస్తే బాగుంటుందనుకొని విషయాన్ని తమ తల్లిదండ్రులతో చెప్పారని  అమర్ అని తెలిపింది తేజ తమ పెళ్ళి పెద్దల సమక్షంలో కుదిరిందని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: