టీవీ: కెసిఆర్ సినిమాతో హీరోగా మారుతున్న జబర్దస్త్ కమెడియన్..!!

Divya
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.. అలాంటివారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు.. గ్రీన్ టీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో గరుడవేగా లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు DOP గా పనిచేసిన అంజి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా తెలంగాణ ప్రాంతం బంజారా అనే నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రానికి కెసిఆర్ అనే ఒక పవర్ ఫుల్ టైటిల్ ని లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మంత్రి అయినటువంటి మల్లారెడ్డి చేతుల మీదుగా 50 అడుగుల కటౌట్ తో టైటిల్ లాంచ్ ను చాలా గ్రాండ్గా జరిపినట్లు తెలుస్తోంది.


ఈ సినిమాలో అనన్య హీరోయిన్గా నటిస్తూ ఉండగా సీనియర్ నటులలో తనికెళ్ల భరణి, ధనరాజ్, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మాస్ట్రో చైర్మన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. బలగం మధు ఈ సినిమాకి ఎడిటర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అంజి కనకవ్య సన్నీ ప్రవీణ్ లోహిత్ తదితరులు సైతం ఇతర పాత్రలు నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకి తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏమైనా లింక్ ఉందా లేదా అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..


ఈ మధ్యకాలంలో తరచూ ఇలాంటి మూవీస్ సైతం ఎక్కువగా విడుదలవుతున్నాయి.. ముఖ్యంగా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సినిమాలు విడుదల చేస్తూ మరింత హైప్ పెంచుకునే పనిలో పడ్డారు రాజకీయ నాయకులు. రాంగోపాల్ వర్మ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కథాంశంతో వ్యూహం అనే చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది .ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఇటీవలే విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: