టీవీ: చిరంజీవి వల్లే ఆ బుల్లితెర నటుడి కెరియర్ నాశనం అయ్యిందా..?
వివి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మా అమ్మ కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు గ్రామానికి చెందినవారు.. నాన్న అనంతపురం జిల్లాలోని గుంతకల్ కి చెందిన వారు.. అసలు మా కుటుంబానికి ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు.. నాన్నగారు బెస్ట్ యాక్టర్ గా నాటకాలు వేసి సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా అవార్డులు కూడా తీసుకున్నారు. ఆ విధంగా మా నాన్న నాటక రంగంలో ఉండడం వల్లే నేను నటన వైపు ఆసక్తి చూపాను. 2023లో నాన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా రిటైర్ అయితే.. స్పెషల్ ఆఫీసర్గా చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. 2016లో చనిపోయే వరకు కూడా నాన్న జాబ్ చేశారు. ఇక నేను బెంగళూరులో బీటెక్ పూర్తి చేశాను అంటూ రాజ్ కుమార్ వెల్లడించారు.
ఇక నాన్న వెంట షూటింగ్లకు వెళ్లడంతో సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాను. కార్తీక్ లా, చిరంజీవిలా ఉన్నావని అందరూ నన్ను చూసి అనేవారు. హీరోలా ఉన్నావని వచ్చిన కామెంట్ల వల్లే పొంగిపోయి ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆలయ శిఖరం సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి గారిని మొదటిసారి చూశాను. ఇక ఆయనను చూశాకే హీరోలంటే ఇలా మెయింటైన్ చేయాలా అనిపించింది. ఇకపోతే చిరంజీవి లాగా ఉన్నావంటూ ఇండస్ట్రీకి పంపారు కానీ ఇక్కడ సరైన అవకాశాలు రాక , కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది.. అటు జాబు చేసుకోలేక ఇటు అవకాశాలు పొందలేక.. మధ్యలో సతమతమవుతున్నాను అంటూ ఆయన తెలిపినట్లు సమాచారం.