ఒక్క దెబ్బకి.. మళ్లీ గురువునే ఫాలో అవుతున్న బన్నీ?

praveen
అల్లు అర్జున్... గత కొన్ని రోజులుగా అటు మీడియాలోగాని, ఇటు జనాల్లో గానీ బాగా వినబడుతున్న మాట. దానికి కారణం అందరికీ తెలిసిందే. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఘటన కారణంగా ఒక నిండు ప్రాణం పోగా, అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకొని విచారణ జరపడం కూడా అయ్యింది. అయితే ఆ తరువాత డిసెంబర్ 5న థియేటర్ దగ్గర జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ స్పందించిన విధానం కావచ్చు... పలు వీడియోస్ లలో కావచ్చు.. తాను ధరించిన డ్రెస్సుల పై కూడా భారీగా విమర్శలు రావడం తెలిసిందే.
మరీ ముఖ్యంగా... రేవతి కుటుంబంపై స్పందించిన వీడియోలో అల్లు బాబు గొడ్డలి ఉన్న హూడి వేసుకోవడంతో అల్లు అర్జున్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు! అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక జైలు నుంచి విడుదలయ్యాక టాలీవుడ్ ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా లైవ్ వీడియో పెట్టాడు. అప్పుడు కూడా బన్నీ తన బ్రాండ్ ను ప్రమోట్ చేసుకున్నాడు అంటూ విమర్శలు వచ్చాయి. వైట్ టీ షర్ట్ పై ఐకాన్ అని వేసుకోవడమే దానికి కారణం.
మరోవైపు అల్లు అర్జున్ తన గురువుగా దర్శకుడు సుకుమార్ ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే సుకుమార్ లేకుంటే అల్లు అర్జున్ అనేవాడు లేడు కాబట్టి! ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా కెరీర్లో ఈ స్థాయికి వచ్చాడంటే దానికి కారణం దర్శకుడు సుకుమార్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక పుష్ప సినిమా కూడా సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. అయితే సంధ్య థియేటర్ ఘటన తరువాత సుకుమార్ చాలా సైలెంట్ అయిపోయాడు. ఇంటర్వ్యూలలో గాని, బయటగాని సుకుమార్ కనబడిన దాఖలాలు లేవు. ఆ ఘటన తాలూక బాధ సుకుమార్లో చాలా స్పష్టంగా ఉందని తెలుస్తోంది. ఆ బాధతోనే ఆయన ఎక్కడా కనబడడంలేదని, వినికిడి. ఈ విషయంలో సుకుమార్, తన హీరో అయినటువంటి అల్లు అర్జున్ ని సుతారంగా మందలించినట్టు భోగట్టా. అందుకే అల్లు అర్జున్ రెండో సారి పోలీస్ స్టేషన్ కి వెళ్లినప్పటి నుంచి ఆయనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. రెండోసారి విచారణకు పోలీసు స్టేషన్ కు వెళ్లిన బన్నీ తన షర్ట్ పై కానీ, ఎక్కడా కానీ బ్రాండ్ పేరు గానీ పుష్ప 2 మూవీ గురించి కానీ ప్రమోట్ చేసేలా కనిపించలేదు మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: