టీవీ: ఆయనను పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా ఇండస్ట్రీకి వచ్చా - రీతూ చౌదరి..!
ఈ సందర్భంగా అసలు నువ్వు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు అని రీతూ చౌదరిని ఆలీ అడగగా.. ఆమె మాట్లాడుతూ.. నేను నాగచైతన్యను పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చాను అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. దీంతో ఆలీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదల చేశారు. ఇక ఈ షో సెప్టెంబర్ 26వ తేదీన టెలికాస్ట్ కానుంది.. ఇకపోతే ప్రోమోలోనే ఇంత షాకింగ్ గా ఆన్సర్ ఇచ్చిన రీతూ చౌదరి ఫుల్ ఎపిసోడ్ లో ఏ విధంగా తన సమాధానాలతో అందరినీ ఆశ్చర్యపరిచిందో చూడాలి.
రీతూ చౌదరి ఒకప్పుడు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ తన నటనతో కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈమె సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకునే స్థాయికి ఎదిగిందని చెప్పాలి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రతి ఫోటోని షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ.. ఇలా తన గ్లామర్ షో తోనే మరింతగా అందరిని ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా రీతూ చౌదరి గ్లామర్ కి చాలా మంది ఫిదా అవుతున్నారని చెప్పాలి.