టీవీ: వామ్మో శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

frame టీవీ: వామ్మో శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

Divya
ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే ఎవరు ఊహించని విధంగా సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఒకవైపు పలు షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ ఇంకొక వైపు సినిమాలలో కూడా అవకాశాలు సొంతం చేసుకుంది . ఇప్పటికే రెండు మూడు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమె మరికొన్ని సినిమాలలో హీరోకి చెల్లి, అక్క పాత్రలో కూడా నటించి మెప్పించింది.

ఇకపోతే సినిమాలలో అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించిన ఈమె గత కొంతకాలంగా బుల్లితెరకే పరిమితమైందని చెప్పాలి. బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసిన శ్రీముఖి ఈ షో ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఊహించని రేంజ్ లో బుల్లితెరపై తన సత్తా చాటుతోంది. ఇకపోతే శ్రీముఖి విషయానికి వస్తే ఎప్పుడూ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట హాట్ టాపిక్ గా మారుతూ యువతను అట్రాక్ట్ చేసే ఈమె తాజాగా చిరంజీవి సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.  అయితే ఆమె ఏ పాత్రలో నటిస్తోంది అన్న విషయం మాత్రం బహుశా ఎవరికీ తెలియదు.

కానీ తాజాగా ఆమె డబ్బింగ్ పూర్తి చేసుకున్నట్లు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.  అయితే ఈ సినిమాలో శ్రీముఖి నిజంగా నటించిందా లేక ఎవరి క్యారెక్టర్ కైనా డబ్బింగ్ చెప్పిందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.  కానీ శ్రీముఖి కూడా డబ్బింగ్ చెప్పిందని తెలిసి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు అల్లరిగా కనిపించే శ్రీముఖిలో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.  ఏది ఏమైనా ఈ సినిమాలో పాత్రను దక్కించుకుందా లేక డబ్బింగ్ కి పరిమితమైందా అన్న విషయం తెలియాలి అంటే ఆగస్టు 11 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఆ రోజు చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: