TV: బిగ్ బాస్ 7 డేట్ ఫిక్స్.. ఇక ఫుల్ సందడే..!

Divya
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా ఇప్పుడు ఏడవ సీజన్ కి సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నామంటూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు ఇక ఆగస్టు మొదటి వారానికి కంటెస్టెంట్లను ఫైనలైజ్ చేసి సెప్టెంబర్ మొదటివారం నుంచి షోని ప్రారంభించబోతున్నారని సమాచారం. ఇకపోతే ఈ సీజన్లో పాటిస్పేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరు.. ఈ సీజన్లో హోస్ట్ గా చేసేది ఎవరు అనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది.
ఇక పోతే ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్ ల కంటే ఈసారి చాలా ఎంటర్టైన్మెంట్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. అంతేకాదు ఈ సీజన్ హోస్టు మారుతున్నారని నిన్నటి వరకు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి పేర్లు హోస్ట్ నాగార్జున స్థానంలో వినిపించాయి. మరోవైపు  హీరో రాణా పేరు వినిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కానీ ఇప్పుడు మరొకవైపు నాగార్జుననే ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తారు అంటూ ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక పోతే మరొకవైపు ఈ బిగ్ బాస్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయానికి వస్తే సెప్టెంబర్ 9 ఆదివారం నాడు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్త వానికి సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారు ఒకవేళ అన్నీ కుదిరితే ఆ రోజే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే సెప్టెంబర్ తొమ్మిది పక్కాగా స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఏదేమైనా ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకులను భారీగా అలరించడానికి సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: