లింగమనేని ఫిట్టింగ్: బాబును రోడ్డున పడేస్తారా?
మరి చంద్రబాబు ఖాళీ చేయొచ్చు కదా? లింగమనేని అక్రమంగా కట్టుకున్న ఇంట్లో చంద్రబాబు ఉండటం ఒకెత్తు అయితే దాన్ని ఖాళీ చేయమని అడిగితే ఎలా ఖాళీ చేస్తామని ఎదురు ప్రశ్నించడం మరొక ఎత్తు. పోనీ లింగమనేని ఇల్లు అయితే దానికి రెంట్ కడుతున్న బిల్లు ఉండాలని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఖాళీ చేయరు. రెంట్ కట్టరు. లింగమనేని ఇల్లు అంటారని వైసీపీ నేతలు అంటున్నారు.
తప్పుగా ప్రభుత్వ భూమిలో కట్టిన ఇంట్లో చంద్రబాబు ఎలా ఉంటాడని.. దీనిపై సరియైన విచారణ జరగాలని వైసీపీ భావిస్తోంది. కానీ ఆ ఇంటి గురించి కోర్టుకెళ్లి తెచ్చుకున్న స్టేతోనే అక్కడ ఉంటున్న విషయం తెలిసిందే. కానీ టీడీపీ పత్రిక మాత్రం ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ లోనే సీనియర్ నాయకుడు ఆయన్నే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని రాయడం వెనక మరోసారి తన ప్రేమను చాటుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు జోరు మీదున్నాయి.
ఓ వైపు లోకేశ్ పాదయాత్ర, మరో వైపు పవన్ వారాహి యాత్ర జరుగుతుంటే చంద్రబాబు ఉంటున్న ఇంటిపై కాంట్రవర్సీ కొనసాగుతుంది. ఇలా రోజుకో మలుపుతో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో యుద్ధమే జరుగుతుందనేలా మూడు పార్టీల నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం ఖాయం. కాబట్టి చంద్రబాబు ఇల్లా.. లింగమనేని ఇల్లా అన్నది పక్కన బెడితే సీనియర్ నాయకుడు ఉంటున్న ఇల్లుని ఖాళీ చేయించాలని చూడటం ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత నిర్ణయమని టీడీపీ వర్గాలు విభేదిస్తున్నాయి.