టీవీ: దర్శకుడిగా మారిన జబర్దస్త్ శాంతి కుమార్..!

Divya
జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఎంతోమంది కమెడియన్లు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొంతమంది హీరోలుగా సత్తా చాటుతుంటే మరి కొంతమంది కమెడియన్లుగా పాపులారిటీ దక్కించుకున్నారు. ఇంకొంతమంది దర్శకులుగా మారి మొదటి సినిమాతోనే ఊహించని విజయాలను సొంతం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇలా ఉండగా తాజాగా జబర్దస్త్ నుంచి మరొక కమెడియన్ శాంతి కుమార్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

ఆది సాయికుమార్ వంటి సీనియర్ నటుడితో "నాతో నేను" అనే సినిమాను శాంతి కుమార్ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక పాటను హీరో ఆది సాయికుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి ఆచితూచి మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నారు అంటూ ఆది స్పష్టం చేశారు. ఇకపోతే ఈ చిత్రం నుంచి "ఓసినీ వయ్యారి రామచిలుక" అంటూ సాగే ఒక లిరికల్ వీడియోను హీరో ఆది గురువారం విడుదల చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.." ఈమధ్య నాన్న కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆయనకు సంబంధించిన లుక్కును కూడా విడుదల చేస్తాము . ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ నా పాత్ర చాలా కొత్తగా ఉంటుందని నాన్న కూడా చెప్పారు.

ఇది ఒక మంచి తెలుగు కథ ప్రేక్షకులు నన్ను తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నాను. ఇక ఈ పాట కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. సినిమా కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు. ఇక కమెడియన్ కం దర్శకుడు శాంతి కుమార్ మాట్లాడుతూ.. జబర్దస్త్ కమెడియన్ గా ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు.. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేశాను.. కథ , మాట, పాటలు అన్నీ నేనే రాసుకొని నిర్మాతల సహకారంతో ఈ సినిమాను పూర్తి చేశాను.. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను అంటూ ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: