టీవీ: నటి కస్తూరిపై ఓంకార్ హాట్ కామెంట్స్..!!

Divya
వెండితెరపై పలు చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కస్తూరి శంకర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రస్తుతం పలు సీరియల్స్ లో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది నటి కస్తూరి. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటా గృహలక్ష్మి అని నాటికలో తులసి పాత్రల ఎంతో అద్భుతంగా నటిస్తోంది కస్తూరి. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ ఎలాంటి విషయాన్ని అయినా షేర్ చేస్తూ ఉంటుంది కస్తూరి. అప్పుడప్పుడు కొన్నిసార్లు వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటుంది.

ఇలాంటి విషయాలను పక్కన పెడితే తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓంకార్ షో సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమో చాలా వైరల్ గా మారుతోంది. ఈ ప్రోమోలో ఓంకార్ కస్తూరి గురించి మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కస్తూరి శంకర్ వేదికపైకి వచ్చి రాగానే చిరంజీవి పాటకు అదిరిపోయే డాన్స్ వేయడం జరిగింది. ఈ పర్ఫామెన్స్ తర్వాత యాంకర్ ఓంకార్  కస్తూరి తో మాట్లాడడం జరిగింది.


కస్తూరి గారు మీరు కాస్త లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి రైట్ టర్న్ ఇవ్వండి అంటూ చెబుతూ ఏ యాంగిల్ లో చూసిన కూడా మీరు అసలు ఒక బిడ్డకు మదర్ లాగా కనిపించలేదు. మరదలాగా ఉన్నారంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ఓంకార్ ఒక్కసారిగా తనని మరదలు అనడంతో కాస్త నవ్వుల వర్షం కురిపించింది కస్తూరి.. ఈ విషయాన్ని బ్రహ్మ ముడి కనకం సైతం ఊ అంటావా మావా అనే పాటకు కూడా డాన్స్ వేయడం జరిగింది. వీరందరి పర్ఫామెన్స్ చూసిన ఓంకార్ వీరిని మదర్స్ అని పిలిస్తే ఎవరు మదర్స్ లా లేరు అంటూ చెమటలు పట్టించేలా ఉన్నారంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: