టీవీ: బంపర్ ఆఫర్ కొట్టేసిన సుడిగాలి సుధీర్.. సుడి తిరిగినట్టేనా..?

Divya
ప్రముఖ బుల్లితెర కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బుల్లితెర మెగాస్టార్ గా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన పలు చానల్స్ లో షోలకి హోస్ట్ గా వ్యవహరించి ఇప్పుడు సినిమాలలో బిజీ అయిపోయారు. ఒకరకంగా చెప్పాలి అంటే బుల్లితెరకు గుడ్ బాయ్ చెప్పారని చెప్పాలి.. సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అక్కడ డిజాస్టర్ గా నిలిచాడు. ఆ తర్వాత త్రీ మంకీస్ అనే సినిమా తీసినా పెద్దగా హిట్ అవలేదు. ఇక ఈ మధ్యనే గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు
ఈ నేపద్యంలోనే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఇకపోతే గాలోడు సినిమా వచ్చిన తర్వాత సుధీర్ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అందుకే  ఇంతకీ ఏం చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన సడన్గా నాలుగో మూవీ ను  అప్డేట్ రివీల్ చేయడం గమనార్హం.  బ్యాచిలర్ అనే డబ్బింగ్ మూవీ వల్ల తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హార్ట్ బ్యూటీ దివ్యభారతితో ఆయన తన కొత్త సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం.
ఒక అఫీషియల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం దీంతో నెటిజన్లు కూడా మాట్లాడేసుకుంటున్నారు. సుధీర్ బంపర్ ఆఫర్ కొట్టేసారని తిరిగినట్లే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. ఏకంగా ఆయన సినిమాలో  హార్ట్ బ్యూటీ నటిస్తోందని తెలిసి సినిమాపై అప్పుడే అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి సుదీర్ సినిమాలో దివ్యభారతి హీరోయిన్గా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. ఇక సుధీర్ విషయానికి వస్తే ఇటీవలే మళ్లీ బుల్లితెరపై ఆయన ఫోకస్ చేస్తున్నారని చెప్పవచ్చు.. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా కనిపించి సందడి చేశారు. కాబట్టి ఆయన అటు సినిమాలు ఇటు బుల్లితెర షోలను హ్యాండిల్ చేసే అవకాశం కూడా ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: