టీవీ: జీవితంలో మరిచిపోలేని సంఘటన అది - కరాటే కళ్యాణి..!

Divya
తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు కరాటే కళ్యాణి. ఈమె లేడీ కమెడియన్ గా నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా భారీ పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా పలు సినిమాలలో వ్యాంప్ క్యారెక్టర్లు పోషించి నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అంతేకాదు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ.. ఇక్కడ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షోలో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత ఈమెకు మరింత గుర్తింపు లభించిందని చెప్పాలి.

ఇకపోతే సినిమాలు, సీరియల్స్ పక్కన పెడితే.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వాటిల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే వెండితెరపై దాదాపు 125 కు పైగా చిత్రాలలో నటించిన ఈమె  తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఆరితేరారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. నేను గతంలో నటించిన పలు క్యారెక్టర్లు చెబుతూ చాలామంది నన్ను అలా మాట్లాడొద్దని అన్నారు. కానీ నేను కూడా ఒక భారతీయురాలినే.. రాముడు గురించి లేదా ఇంకెవరి గురించైనా ఏ విషయంపై అయినా సరే మాట్లాడే హక్కు నాకుంది.  అప్పుడు చేసిన క్యారెక్టర్లు చేయకూడదు అని నేను సినిమాలకు దూరంగా ఉంటున్నాను అంటూ ఆమె చెప్పుకు వచ్చింది.

ఇకపోతే కెరియర్ కొత్తలో సీరియల్స్ లో నటించాను.  కానీ సినిమాలలో నటిస్తే గుర్తింపు వస్తుందని అటువైపుగా ప్రయత్నించాను. కానీ అక్కడ నేను చేసిన తప్పు వల్గారిటీ ఉన్న పాత్రలకు అంగీకరించడమే.. వల్గారిటీ ఉంటుందని చెప్పిన తర్వాతే ఒప్పుకున్నాను. అప్పట్లో ఇండస్ట్రీలో ఎవరి మద్దతు లేకపోవడం వల్ల ఆ దారిలో వెళ్లాల్సి వచ్చింది. ఒక సినిమాలో అలీ నటించిన సినిమాలో పైట జార్చే సీను ఉంది.  అందులో నటించకూడదనుకున్నాను. కానీ నేను కాకపోతే ఇంకొకరు నటిస్తారు.. గుర్తింపు వస్తుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో నటించాల్సి వచ్చింది అంటూ చెప్పుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: