టీవీ: కొమరక్క నవ్వుల వెనుక ఇంత కన్నీటి కష్టాలు ఉన్నాయా..?

Divya
ఒకవైపు సినిమాలలో మరొకవైపు కామెడీ షోలలో ప్రేక్షకులకు కడుపుబ్బా బాగా నవ్వించే ఎంతోమంది కమెడియన్ల జీవిత కథ వెనుక ఎన్నో తెలియని విషాద గాథలు మనకు తారసపడతాయి. వాస్తవానికి సెలబ్రిటీలంతా గోల్డెన్ స్పూన్ తో పుట్టి ఉంటారు. వారికి ఎటువంటి సమస్యలు ఉండవు అని అందరూ అనుకుంటారు. కానీ వారే తమ సమస్యలను బయటపెట్టినప్పుడు అవునా అని ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా ఎంతోమంది ఎన్నో కష్టాలు పడి తమ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇప్పటికే ఎంతోమంది తమ ఉనికిని చాటుకోవడానికి కష్టాలకడిని దాటి ప్రపంచంలోకి అడుగు పెట్టారని చెప్పవచ్చు.  అలాంటి వారిలో తన కామెడీ పంచులతో అదరగొట్టే కొమరం అలియాస్ కొమరక్క గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  పశువులంటే మాకు ప్రాణం.. అని ట్రేడ్ మార్క్ డైలాగుతో బాగా పాపులారిటీ దక్కించుకున్న కొమరక్క తన వాయిస్ మోడ్యుకేషన్ వేషధారణతో బుల్లితెర ప్రేక్షకులనే కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అమ్మాయి వేషధారణలో కొమరక్కగా ఎంతో మందిని అలరించారు కొమరం.
ఇకపోతే తాజాగా నాని .. కీర్తి సురేష్ నటించిన దసరా చిత్రంలో కొమరం ఒక పాత్రలో నటించారు . ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ కి హాజరైన కొమరం తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను తాను అనుభవించిన దుర్ఘటనలను గురించి షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాద్ సిగ్నల్స్ వద్ద స్కూల్ బ్యాగులు,  గొడుగులు అమ్మాను. ఆ తర్వాత కోటిలో నిలబడి వస్తువులు కూడా విక్రయించాను ఆఖరికి పాత్రలు కడిగి పూట గడుపుకున్న రోజులు ఉన్నాయి. కానీ సక్సెస్ అయ్యాను . ఐదేళ్ల నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు అలాంటి పరిస్థితులు మళ్లీ రావద్దని కోరుకుంటున్నాను..మా నానమ్మ చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది మా అమ్మ కూడా సినిమాల్లోకి పొమ్మనే చెప్పింది.. ఇక నా భార్య రజిత ఐదేళ్లపాటు రాత్రింబవళ్లు టైలరింగ్ చేసి నాకు ప్రతి నెల 3వేల రూపాయలు నా ఖర్చులకు అకౌంట్లో వేసేది. ఆమె లేకపోతే నేనులేను అంటూ ఎమోషనల్ అయ్యాడు కొమరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: