బుట్ట బొమ్మలా అలరిస్తున్న జబర్దస్త్ వర్ష.. ఫిదా అవుతున్న నెటిజన్స్..!

Divya
సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని..  ఆ తర్వాత జబర్దస్త్ వేదికపై కమెడియన్ గా పాపులారిటీ దక్కించుకున్న జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  ముఖ్యంగా ఈమె తోటి కమెడియన్ ఇమ్మానుయేల్ తో కలిసి నడిపే లవ్ ట్రాక్ తో బాగా ఫేమస్ అయ్యింది.  కొంతమంది ఇతడితో నీకు లవ్ అవసరమా అని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది డబ్బుల కోసం ఏదైనా చేస్తావా అంటూ రకరకాలుగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.  అయితే గతంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా అనుమానించారని బాధపడిన వర్ష
 ఆ తర్వాత యాంకర్ రష్మీ సహాయంతో మళ్లీ తనలో కొత్త మార్పులు తీసుకొచ్చింది.

ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు అందుకోవడమే లక్ష్యంగా ఎక్కువగా గ్లామర్ ఫోటోషూట్లతో యువతను బాగా ఆకట్టుకుంటుంది. రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొకసారి బుట్ట బొమ్మలా వైట్ కలర్ గౌన్ తో అందరినీ ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టుగా హెవీ జువెలరీ ధరించి మరొకసారి మంత్రముగ్ధుల్ని చేసింది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే  గత కొన్ని గంటల క్రితం ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలను షేర్ చేయగా.. ఊహించని రేంజ్ లో వాటికి పాపులారిటీ లభిస్తుంది.

ఇక వర్ష విషయానికి వస్తే సినిమాలలో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవైపు జబర్దస్త్.. మరొకవైపు ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో చేస్తూనే.. భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాటు పండుగల సందర్భంగా చేసే స్పెషల్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. భాస్కర్ టీంలో తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వర్ష హీరోయిన్ పీస్ అంటూ అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. ఏది ఏమైనా తన గ్లామర్ తోనే కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మకు సినిమాలలో అవకాశాలు వస్తే బాగుండు అని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: