టీవీ: యాంకర్ సుమ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Divya
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు యాంకర్ సుమ.. కేరళ ఇండస్ట్రీకి చెందిన ఈమె రాజీవ్ కనకాల ను వివాహం చేసుకున్న తర్వాత తెలుగింటి కోడలిగా అడుగుపెట్టి తన మాటలతో అల్లరి చేష్టలతో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో అలుపెరుగని బాటసారిలా నిరంతరం కష్టపడుతూ ఎంతోమందికి వినోదాన్ని అందిస్తూనే ఎన్నో షోలను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా కొన్ని వేల షోలకు వ్యాఖ్యాతగా సుమ వ్యవహరించాలని సందేహం లేదు.
ముఖ్యంగా బుల్లితెరపై రారాణి గా తన యాంకరింగ్ తో స్టార్డం సంపాదించుకున్న సుమ భారీ పాపులారిటీని అందుకొని అంతకుమించి ఆఫర్లను కూడా దక్కించుకుంటుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు , టాక్ షోలు ఇలా వరుస షూటింగ్లతో సుమ చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా గృహిణిగా,  తల్లిగా తన బాధ్యతలను మాత్రం చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. బుల్లితెరపై పరిమితం కాకుండా అప్పుడప్పుడు కూడా వెండితెరపై మెరిసి అలరిస్తుండే ఈమె ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించింది.  అయితే ఈ సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు.
ఇకపోతే వర్క్  లైఫు , ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇప్పటికీ కూడా వరుస ప్రోగ్రాంలతో బుల్లితెరపై దూసుకుపోతోంది.. సాధారణంగా సుమ రాజీవ్ కనకాల గురించి చాలామందికి తెలుసు.  కానీ వారి పిల్లల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని చెప్పాలి.  ఎందుకంటే వీరు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు.. కానీ తాజాగా సుమ మాత్రం  పిల్లల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోగా అవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి. సుమ కొడుకు హీరో కటౌట్ కి మించిపోయి కనిపిస్తున్నాడు. సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తే చాలా చక్కగా సెట్ అవుతుంది అని కూడా అభినందిస్తున్నారు.  మొత్తానికైతే సుమా పిల్లలు ఇద్దరు ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు కోరుకుంటూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: