టీవీ: జబర్దస్త్ యాంకర్ కు చేదు అనుభవం.. దండం తల్లి అంటు..?

Divya
తెలుగు బులితేరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్ల సైతం సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాగానే నెట్టుకొస్తున్నారు. ఇక ఎంతోమంది యాంకర్లు కూడా ప్రస్తుతం వెండితెర పైన కూడా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న వారు ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్నారని చెప్పవచ్చు. ఇక అనసూయ జబర్దస్త్ ను మానేసిన తర్వాత ఈ కార్యక్రమానికి యాంకర్ గా సౌమ్యరావుని తీసుకురావడం జరిగింది. ఇక ఈమె కూడా అందచందాలతో కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటోంది.

సౌమ్యరావు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వగానే తన పంచ్ డైలాగులతో అందరికీ షాక్ ఇస్తోంది. ఇక తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ కూడా తెలుగు సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర పైన ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటుంది. ఈ విధంగా బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సౌమ్యరావు వచ్చిరాని తెలుగుతో అందరిని బాగా ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న ఈమె అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సౌమ్యరావు తన డాన్స్ వీడియోల పైన ట్రోలింగ్ కూడా గురవుతూ ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక డాన్స్ వీడియోని షేర్ చేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ. ఈ వీడియో వైరల్ గా మారడంతో కొంతమంది నేటిజెన్లు ఈ వీడియో పైన స్పందిస్తూ సౌమ్యరావుకు డాన్స్ అసలు సరిగ్గా రాలేదు అంటూ పలు రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ దయచేసి మీరు ఇంకొకసారి ఇలా డాన్స్ చేయకండి మీకు దండం అంటూ కూడా కామెంట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం సౌమ్యరావు చేసిన ఈ డ్యాన్స్ వీడియో నేటిజన్లు నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.అందుకు సంబంధించిన ఈ వీడియో కూడా తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: