టీవీ: తండ్రి చనిపోతే సంతోషంగా ఫీలయ్యా.. జబర్దస్త్ పవిత్ర..!

Divya
సాధారణంగా ఎప్పుడు కనిపించే కొంతమంది కమెడియన్ల వెనుక ఎవరికి తెలియని కన్నీటి కష్టాలు కూడా ఎన్నో ఉంటాయి అయితే వాటిని మరిచిపోయి మనకు మాత్రం నవ్వులను పంచుతూ ఉంటారు.. అలాంటి వారిలో జబర్దస్త్ పవిత్ర కూడా ఒకరు అని చెప్పవచ్చు ..ఈమె పైకి నవ్వుతూ నవ్విస్తూ ఎంత సంతోషంగా ఉంటుందో తన జీవితంలో అంతకుమించి కన్నీటి గాధలు ఉన్నాయి. మొదట టిక్ టాక్ వీడియోలు చేసుకునే ఈమె ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా పలు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత ఆమె పూర్తి జాతకం మారిపోయిందని చెప్పవచ్చు.
అద్భుతమైన కామెడీ పంచలతో డైలాగ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ బుల్లెట్ భాస్కర్ ,మంకీ వెంకీ,  హైపర్ ఆది,  రాఘవ టీమ్స్ లో కనిపిస్తూ కడుపుబ్బ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది.. ముఖ్యంగా పాగల్ పవిత్రగా మనకు నవ్వులు పూయిస్తున్న ఈ ముద్దుగుమ్మ జీవితంలో కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి... వీటి గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర ఎన్నో విషయాలను బయటపెట్టింది అంతేకాదు తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలు విషాదాలను కూడా బయట పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
పవిత్ర మాట్లాడుతూ మా నాన్న ఒక లారీ డ్రైవర్ అమ్మ పొలం పనులకు వెళుతూ ఉండేది ఇద్దరు పని చేస్తే తప్ప పోటగడవని పరిస్థితి ఒక్కోసారి మూడు పూటలు కడుపు నింపుకోవడానికి కూడా చాలా ఆలోచించే వాళ్ళము.. దీనికి తోడు మా నాన్న తాగుడుకు కూడా పూర్తిగా బానిస అయ్యాడు.. మమ్మల్ని గాలికి వదిలేయడం తో మా పిన్ని సహాయంతోనే ఇంటర్ వరకు పూర్తి చేశాను ఇంకా వాళ్లను కష్టపడటం ఎందుకని చదువుకి గుడ్ బాయ్ చెప్పి.. హైదరాబాదుకు వచ్చి సెలూన్ పార్లర్ కూడా పెట్టుకున్నాను.. అప్పుడే అనుకోకుండా జబర్దస్త్ లో అవకాశం వచ్చింది లేకపోతే మా నాన్న తో 13 సంవత్సరాలు నేను మాట్లాడలేదు..  ఏడాది క్రితమే ఆయన మరణించారు కానీ ఆ క్షణం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ పవిత్ర తన ఆవేదనను అభిమానులతో పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: