టీవీ: అతనితో గొడవకు దిగిన అనసూయ..!

Divya
వాలెంటైన్స్ డే ప్రతి ఒక్కరికి స్పెషల్ అన్న విషయం తెలిసిందే. పెళ్లయిన వారు భార్య భర్తతో వాలెంటైన్ గిఫ్టులతో తెగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా స్టార్ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే పిక్కు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక నెటిజన్ తో వాగ్వాదానికి కూడా దిగింది అని చెప్పవచ్చు.. వాలంటైన్స్ డే సందర్భంగా కొంతమంది సెలబ్రిటీలు రహస్యంగా ఈ విషెస్ చేసుకుంటారు ఇంకొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా పెడతారు. కానీ లవర్స్ డే రోజున కూడా కాంట్రిబ్యూసీ ద్వారా వార్తల్లో నిలుస్తారు అంటే ఎవరు ఆలోచన కూడా చేయరు.
అలాంటిది తాజాగా స్టార్ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ వాలంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలసి దిగిన ఒక పిక్ షేర్ చేసి విష్ చేయడం గమనార్హం. తన భర్తతో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేసి నీతో లైఫ్ చాలా క్రేజీ అని రాసుకొచ్చింది.  దీనికి ఒక నెటిజన్ రియాక్ట్ అవుతూ అలా ఏం లేదు అక్క వాడి దగ్గర డబ్బు ఉంది అందుకే అని కామెంట్ చేశాడు. ఇంకేముంది అనసూయ రంగంలోకి దిగి నెటిజన్లు జలక్ ఇచ్చింది..

నార్మల్ డేస్ లో అంటే ఊరుకునేదేమో కానీ భర్తతో కలిసి అది కూడా వాలెంటైన్స్ డే రోజున పెట్టిన స్పెషల్ పిక్కు పై ఒక నిటిజన్ అలా కామెంట్ చేసేసరికి ఆమె కౌంటర్ వెయ్యకుండా ఊరుకోలేకపోయింది ఏకంగా చెప్పుతో చెంపలపై కొట్టేస్తానని చెప్పకనే చెబుతూ కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. కామెంటుపై స్పందిస్తూ.."  అదేంట్రా తమ్ముడు అలా అనేసావు ఎంతుంది ఏంటి డబ్బు నాకు లేదా మనీ మరి చెప్పు నీకు అన్ని తెలుసు కదా అయినా ఆయన డబ్బు నా డబ్బు అనేది కూడా సపరేట్ గా ఉంటుంది రేయ్ చెప్పరా బాబు అయినా బావ గారిని వాడు వీడు అనొచ్చా? నీది ఏం పెంపకం రా? చెంపలేసుకో లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. చివరికి నేను చెంపలేస్తాను అంటూ షాకింగ్ ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: