టీవీ: అందుకే జబర్దస్త్ రోహిణిని మల్లెమాల తొలగించలేదా..?
దీంతో ఈమెను మల్లెమాలవారు టీమ్ లీడర్ గా చేశారు.. దీంతో కొంతమంది కమెడియన్స్ లేడీ టీమ్ లీడర్ ఏంటి అంటూ చాలామంది ఈమె పైన కోపంగా ఉండేవారని సమాచారం. మొదట్లో నిరాశపరిచిన ఆ తరువాత పర్వాలేదు అనిపించుకుంది రోహిణి. జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో కొంతమంది టీమ్ లీడర్తో పోలిస్తే రోహిణి కామెడీ పరంగా భాగ ప్రదర్శిస్తుంది అనే వార్తలు బుల్లితెర ప్రేక్షకుల నుంచి వినిపిస్తూ ఉంటాయి. అయితే కొంతమంది రోహిణి రెమ్యూనరేషన్ చాలా తక్కువ అని .. పాపులారిటీ కోసమే జబర్దస్త్ కార్యక్రమం చేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఒకవేళ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే వెంటనే ఈమెను మల్లెమాలవారు తొలగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.మల్లెమాలవారు కకృతితో కాస్ట్ కటింగ్ పేరుతో చాలామంది కంటిస్టెంట్లను వెనక్కు పంపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ వంటి వారికి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇవ్వాలని ఉద్దేశంతోనే మల్లెమాలవారు వారిని తొలగించారని.. కానీ రోహిణి కి తక్కువ రెమ్యూనరేషన్ కావడంతో ఈమెను తొలగించ లేదని తెలుస్తోంది. అందుచేతనే ఈమె ఇంక జబర్దస్త్ లో కంటిన్యూ చేస్తోందని వార్తలు మల్లెమాల సంస్థ నుంచి వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.