టీవీ: హైపర్ ఆది పంచ్ లకు షాక్ లో ధనుష్..!

Divya
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ , మలయాలకుట్టి సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం సార్ ఈ సినిమాను తమిళ్లో వాతి పేరిట రిలీజ్ చేయబోతున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే విధంగా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కించడం జరిగింది.
మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా హైపర్ ఆది తన పంచులతో ఏకంగా స్టార్ హీరో ధనుష్కే షాక్ కలిగేలా చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతూ తన పంచ్ డైలాగ్ లతో అందరిని చాలా ఆకట్టుకున్నాడు.  ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ధనుష్ పక్కన పూర్తిస్థాయి పాత్రలో నటించడం తన అదృష్టమని చెబుతూనే..హీరోయిన్ సంయుక్త మీనన్ పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.

ప్రతి స్కూల్లోనూzl,  కాలేజీలోనే ఇలాంటి అందమైన టీచర్ ఒకరు కచ్చితంగా ఉంటారు. మనం ఏ క్లాస్ కి అటెండ్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా ఆ టీచర్ క్లాస్ కి అటెండ్ అవుతాము మళ్లీ ఫెయిల్ అయ్యేది కూడా అదే సబ్జెక్టేm ఎందుకంటే అక్కడ వినడం ఉండదు కేవలం చూడడం మాత్రమే కదా.. అందుకే సబ్జెక్టు కూడా ఫెయిల్ అవుతాము. అలాంటి గ్లామర్ సంయుక్త మీనన్ గారిది తెలుగు కూడా ఆవిడ చాలా బాగా నేర్చుకుంది చాలా హార్డ్ వర్కర్.. ఒకసారి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆరోజు ఆవిడ స్పీచ్ మొదలు పెట్టడమే కాదు ఇల్లేమో దూరం మంది దాన్ని వినగానే ఈవిడ ఇంత దూరం ఎప్పుడొచ్చిందో అని నేను కూడా షాక్ అయ్యాను అంత హార్డ్ వర్కర్ ఆమె అని రకరకాలుగా చెప్పడంతో ధనుష్ కూడా ఆది మాటలకు షాక్ అయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: