టీవీ: జబర్దస్త్ మానేయడానికి కారణం అదే.. సింగర్ మనో..!!

Divya
బుల్లితెరపై జబర్దస్త్ షోలో తాజాగా కొంతమంది కమెడియన్లతో పాటు జడ్జిలు కూడా మానేయడం జరిగింది. తాజాగా సింగర్ మనో జడ్జి నుంచి తప్పుకోవడం పై తాజాగా స్పందించడం జరిగింది. జబర్దస్త్ కు తాను చిన్న గ్యాప్ ఇచ్చానని మళ్లీ తిరిగి వస్తానని చెప్పారు. కరోనా కారణంగా కొన్ని షోలు వాయిదా పడ్డాయని ఇందులో ఇళయరాజా ,ఏఆర్ రెహమాన్లు తాను చేయవలసిన షోలు కూడా ప్రస్తుతం పూర్తి చేయబోతున్నట్లు తెలియజేశారు. 2020లో ఖరారు అయిన ఈ షో ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

సరిగమతో పాటు జబర్దస్త్ షో కూడా కొనసాగిస్తామని తెలియజేశారు. తనకు కామెడీ అంటే చాలా ఇష్టమని అందుచేతనే దగ్గరి వ్యక్తులకు దాని గురించి బాగా తెలుసు అని తెలియజేశారు. జబర్దస్త్ లోనే కమెడియన్ల స్కిట్టు తో తాను బాగా ఎంజాయ్ చేసేవారిని తెలిపారు. త్వరలోనే మళ్లీ ఆ షోకి వస్తానని అటు సరిగమలో కూడా జడ్జిగా వ్యవహరిస్తారని స్పందించారు. ఇది నా హోమ్ గ్రౌండ్ లాంటిదని ఇదే తన పని అంటూ తెలియజేశారు సింగర్ మనో.
గతంలో ఈ షో లో జడ్జిగా ఉన్నానని.. ఇప్పుడు 5,6 షో సీజన్లు గడిచిన తర్వాత ఈ అవకాశం వచ్చిందని తెలిపారు.ఇది చాలా గొప్ప అవకాశం అని తెలిపారు. ఈ నెల 29 నుండి జీ తెలుగులో ప్రసారం కాబోతోందని తెలియజేశారు. ఈ షో కి జడ్జిలుగా సింగర్ మనతో పాటు ఎస్పీ శైలజ లేడీస్ అనంత శ్రీరాములు కూడా ఉన్నారని తెలిపారు. అయితే కేవలం కరోనా సమయంలో ఇబ్బందుల వల్ల ఈ షోకి దూరమయ్యానని తెలియజేశారు సింగర్ మనో. దీంతో సింగర్ మనో అభిమానులు సైతం కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో జడ్జిలు యాంకర్స్ కమెడియన్స్ కూడా రీ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: