టీవీ: అలాంటి పని చేసిన యాంకర్ సుమ.. ట్రోల్స్ వైరల్..!

Divya
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేని పేరు ఎనర్జిటిక్ యాంకర్ సుమ. ముందుగా ఈమె పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది ఈమె చలాకీతనం.. ఈ వయసులో కూడా తన మాటలతో అందరిని అలరిస్తూ ఎప్పటికప్పుడు బుల్లితెరపై మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే బెస్ట్ యాంకర్ గా మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. నిజానికి స్టార్ సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ యాంకర్ సుమకి ఉందని చెప్పడంలో సందేహం లేదు.
మకుటం లేని మహారాణిగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై పలు షోలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా సినిమాలు చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అవార్డు ఫంక్షన్లలో.. ప్రీరిలీజ్ ఈవెంట్లలో కూడా సందడి చేసే ఈమె తన మాటలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది . ప్రస్తుతం బుల్లితెరపై పలు షో ల ద్వారా బాగా బిజీగా ఉన్న ఈమె మాటలు వింటే చాలు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలలో కూడా కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది.
ముఖ్యంగా తాను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా నవ్వించేలా ఉంటాయి l. అందుకే సుమ అంటే ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం ఏర్పడింది తాజాగా సుమ తన సోషల్ మీడియా ఇన్ స్టా ఖాతాలో కూడా ఫోటోలను,  ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ని కూడా క్రియేట్ చేసుకోగా తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టా వేదికగా ఒక వీడియోను షేర్ చేయగా అందులో పనస చెట్టు దగ్గర పనస పండు తెంపినట్లు కనిపించింది.  ఆ సమయంలో అక్కడున్న కుక్క మొరిగినట్లుగా కూడా మనం వినవచ్చు.  దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వగా ఒక నెటిజన్ మాత్రం నీవు ఆ పనసకాయను దొంగలించావనుకొని ఆ కుక్క అరుస్తుంది సుమక్క .. అంటూ సరదాగా కామెంట్లు చేశారు. మొత్తానికైతే సుమ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: