టీవీ: ఈ వయసులో కూడా సుమకు లవ్ ప్రపోజ్.. సమాధానం ఏంటంటే..!!

Divya
బుల్లితెరపై యాంకర్ గా మొదటి స్థానంలో ఉన్న యాంకర్ సుమ ఈ మధ్యకాలంలో పలుషోలతో పాటు పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలే జయమ్మ పంచాయతీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో సుమ నటనకు గాను ప్రశంశాల వర్షం అందుకుంది. ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతలు పొందింది యాంకర్ సుమ. ముఖ్యంగా యాంకర్ సుమ చేసేటటువంటి కొన్ని ప్రోగ్రామ్స్, ఆడియో రిలీజ్ ,ఫ్రీ రిలీజ్ వంటి వాటికి యాంకర్ గా కనిపిస్తూ ఉంటుంది.

మహిళలలో యాంకర్ సుమకు ఒక సపరేటు బేస్ ఉందని చెప్పవచ్చు. సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ షో కూడా ఒకటి.ఈ షోలో చాలా ఏళ్లుగా ఈ షో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నది. ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారమవుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ లో ప్రతివారం కొంతమంది సెలబ్రిటీలను తీసుకువచ్చి సందడి చేస్తూ ఉంటారు. అయితే ఈ షోకు బాలీవుడ్కు చెందిన రణబీర్ కపూర్, ఆలియా భట్ రావడం కూడా జరిగింది.

ఇదంతా ఇలా ఉండగా రాబోయే ఎపిసోడ్ కు సంబంధించి క్యాష్ షో నిర్వాహకులు తాజాగా ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో ప్రభాస్ శీను, హేమ, ప్రవీణ్ ,హరితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోమోలో వీరందరూ చాలా హుషారుగా ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడం జరిగింది. వీరు వేసుకున్న కామెడీ పంచులు ప్రేక్షకులను బాగా కడుపుబ్బ నవ్విస్తున్నాయి. అంతేకాకుండా యాంకర్ సుమ వీరందరినీ ఒక్కొక్కరిగా పిలిచి పనిష్మెంట్ ఇచ్చి కంటెంట్ ను రాబట్టినట్లు ఈ ప్రోమోలో తెలుస్తోంది. ఈ ప్రోమో చివరికి వచ్చేసరికి ఒక కుర్రాడు యాంకర్ సుమకి ప్రపోజ్ చేస్తాడు ఈ ప్రోమో మొత్తానికి ఇది హైలైట్ గా నిలుస్తోంది. అయితే ఆ అబ్బాయి అలా పువ్వు తీసుకొచ్చి ఐలవ్యూ అని చెప్పగా.. దీంతో సుమ నువ్వు మా అబ్బాయి క్లాస్మేట్ కదా అంటూ అతనిపైన సెటైర్ వేయడం జరిగింది ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: