టీవీ: ఆ విషయంలో అల్లు అర్జున్ కంటే సుడిగాలి సుధీర్ తోపా..?

Divya
సాధారణంగా ఇండస్ట్రీలో ఏ హీరో కైనా సరే అభిమానులు ఉంటారు. అయితే వాళ్ళ స్థాయిని బట్టి అభిమానుల సంఖ్య మారుతూ ఉంటుంది..కానీ ఎటువంటి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ మొదటి స్థానంలో ఉంటారు.. ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ఒక్కొక్కసారి తినడానికి కూడా తిండి లేని పరిస్థితులను చూశాడు. కానీ జబర్దస్త్ పుణ్యమా అని షో ద్వారా ఎంట్రీ ఇచ్చి భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఆ తర్వాత తన టాలెంట్ తో వెండితెరపై కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

అంతేకాదు సోషల్ మీడియాలో కూడా సుడిగాలి సుధీర్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  మరి ఎంతలా అంటే స్టార్ హీరోకి కూడా అంత ఫాలోయింగ్ ఉండదని చెప్పవచ్చు.  అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక పోల్ ట్రెండింగ్ మారింది. ఈ పోల్లో మీకు ఇద్దరిలో ఎవరంటే ఇష్టం అని.. ఓపెన్ గా చెప్పండి అని ఎవరో ఒకరు క్రియేట్ చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా 69 శాతం మంది సుడిగాలి సుధీర్ కి ఓటు వేయగా.. కేవలం 31 శాతం మంది మాత్రమే అల్లు అర్జున్కి ఓటు వేశారు. ఈ క్రమంలో ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయిన అల్లు అర్జున్ కంటే సుడిగాలి సుదీర్ ఎక్కువ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సుడిగాలి సుదీర్ కంటే ఎక్కువ స్థాయిలో మరొకరు లేరు అని చెప్పాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే టాలీవుడ్ లో యంగ్ హీరోస్ కంటే సుడిగాలి సుదీర్కే క్రేజ్ ఎక్కువ.. ఏది ఏమైనా సరే సుధీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందని అల్లు అర్జున్ కంటే సుదీర్ అభిమానులను సంపాదించుకోవడంలో తోపే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: