టీవీ: గాలోడు సినిమా కోసం సుధీర్ పారితోషకం అన్ని లక్షలా..?

Divya
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు తినడానికి తిండి లేక ఉండడానికి నీడ లేక రోడ్డు సైడ్ ఉండే కొళాయి నీళ్లతో కడుపు నింపుకొని అవకాశాల కోసం ఎన్నో అవస్థలు పడ్డాడు. తన జీవితాన్ని కొనసాగించడం కోసం మేజీషన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. అడపాదడపా డబ్బు సంపాదిస్తూ వాటితో జీవనం సాగించేవాడు. ఆ తర్వాత 2013లో జబర్దస్త్ లో స్క్రిప్ట్ రైటర్ గా అవకాశం లభించినప్పుడు అక్కడ అడుగుపెట్టిన సుధీర్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవాడు.

అలా పాపులారిటీ దక్కించుకున్న ఈయన రాంప్రసాద్,  గెటప్ శ్రీను వంటి టీం సభ్యులు దొరకడంతో టీం లీడర్గా ఎదిగి సుమారుగా కొన్ని వందల స్కీట్లు చేశారు.  అంతే కాదు ఇప్పటికీ వీరి ముగ్గురు కలయికలు వచ్చే స్కిట్ల కోసం అభిమానులు అంతలా ఎదురుచూస్తూ ఉంటారు.
ఇకపోతే బుల్లితెర ఇండస్ట్రీలో జబర్దస్త్,  ఎక్స్ ట్రా జబర్దస్త్,  శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలతో పాటు ఢీ వంటి డాన్స్ కాంపిటీషన్ కి కూడా యాంకర్ గా వ్యవహరించారు. కానీ సినిమాలలో వరుస ఆఫర్లు వస్తుండడంతో వీటన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేసారు సుధీర్

ఈ క్రమంలోని సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.  ఆ తర్వాత త్రీ మంకీస్ సినిమా తెరకెక్కించిన కూడా అది పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. కానీ ఇప్పుడు గాలోడు సినిమాతో మన ముందుకొచ్చిన సుధీర్ పర్వాలేదనిపించుకుంటున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఎంత పారితోషకం తీసుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుధీర్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.60 లక్షలు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: