బిగ్ బాస్ 6: శ్రీ సత్య మోసానికి బలైన వాసంతి... పాపం !
వీటిని తీసుకుని వారికీ కేటాయించిన ప్లేస్ లో ఉంచాలి.. చివరగా ఎవరికి ఎక్కువ ఉంటాయో వారు గెలిచినట్లు.. ఓడిపోయిన గ్రూప్ నుండి ఒక్కరు నెక్స్ట్ వీక్ కు ఎలిమినేట్ కావడానికి డైరెక్ట్ గా నామినేట్ అవుతారు. అలా శ్రీసత్య టీం ఓడిపోవడంతో... ఒక పర్సన్ ను ఎంచుకోవడానికి శ్రీసత్య టీం చర్చను స్టార్ట్ చేస్తారు. అందరూ ఏకాభిప్రాయంతో స్లిప్ లలో పేర్లు రాసి ఒకరిని సెలెక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకుంటారు. అలా ఈ స్లిప్ లలో శ్రీసత్య పేరు వస్తుంది.. ముందుగా అనుకున్న ప్రకారం శ్రీసత్యనే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ కావడానికి నామినేట్ కావాలి. కానీ మరుసటి రోజు ఉదయం మళ్ళీ శ్రీసత్య స్లిప్ ద్వారా రావడం నాకు ఇష్టం లేదు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఒకరిని ఎంచుకుందాం అన్న ప్రతిపాదనను తీసుకు వచ్చింది.
ఆల్రెడీ నిన్న సెలెక్ట్ చేసుకున్న తర్వాత... మళ్ళీ ఈ ఓటింగ్ ప్రక్రియ తెచ్చిన శ్రీసత్యను ఎందుకు ఎవ్వరూ క్వశ్చన్ చేయలేదు అర్ధం కాలేదు ? మరియు ఒక టీం కు లీడర్ గా ఉన్న శ్రీ సత్య స్లిప్ ద్వారా వచ్చినట్లు నామినేషన్ కు వెళ్లకుండా ఎందుకు రివర్స్ అయ్యింది అన్నది తనకే తెలియాలి. పైగా అందరితో పోల్చుకుంటే సర్వైవల్ టాస్క్ లో ఎఫర్ట్స్ ఏమీ పెట్టలేదు. అక్కడ కూర్చుని ఎంత సేపు ఫేర్ గేమ్ ఆడండి అంటూ మాట్లాడుతుంది తప్ప చేసింది ఏమీ లేదు. శ్రీసత్య ఇలా చేయడం వలన చేయని అనవసరంగా ఈ టాస్క్ లో బాగా ఆడిన వాసంతి గ్రూప్ లో సభ్యుల ప్రకారం ఎలిమినేట్ కావడానికి నామినేట్ అయింది. అలా శ్రీసత్య మోసానికి వాసంతి బలై పోయింది.