బిగ్ బాస్ హౌస్ లో "పుష్ప"... అంతా షాక్ ?

VAMSI
నిన్న బిగ్ బాస్ సీజన్ 6 లో ఎప్పట్లాగే సోమవారం కావడం వలన నామినేషన్ ఎపిసోడ్ జరిగింది. ఈ ఎపిసోడ్ లో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు.. ఒక్కొక్కరు ఇద్దరినీ నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పాలి.. అందులో భాగంగా ఒక్కొక్కరు నామినేట్ చేసిన వారిని అక్కడ బిగ్ బాస్ ఏర్పాటు చేసిన బురదనీళ్ళ పంప్ కింద కూర్చోవాలి.. అప్పుడు బిగ్ బాస్ వారిపై ఆ నీటిని పంప్ చేస్తారు. ఆ విధంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో అందరూ తమకు నచ్చని ఇద్దరిని ఎంపిక చేసుకుని తగిన కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఇలా హౌస్ మొత్తం కన్నా ఎక్కువ మంది నామినేట్ చేసిన వారిలో బాలాదిత్య ముందున్నారు.
ఆ తర్వాత రేవంత్ ను అత్యధిక మంది నామినేషన్ చేశారు.  అయితే ప్రతివారం జరుగుతున్న ప్రక్రియ కావడం వలన ఎవ్వరూ పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లాల్సిన వారిలో రేవంత్, రోహిత్, అర్జున్ కళ్యాణ్, ఆది , బాలాదిత్య, రాజ్ , శ్రీహన్, ఫైమా, ఇనయ, కీర్తి, మెరీనా, శ్రీసత్య మరియు వాసంతి లు ఉన్నారు. కాగా ఈ ఎపిసోడ్ లో సడెన్ గా పుష్ప రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ అల్లు అర్జున్ వచ్చాడని ఆలోచిస్తున్నారా ? అదేమీ కాదండీ... నామినేషన్ టైం లో రేవంత్ ను పదే పదే టార్గెట్ చేస్తుంటే... ఆఖరిగా కెప్టెన్ సూర్య సైతం రేవంత్ ను నామినేట్ చేశాడు.
దీనితో పంప్ కింద కూర్చున్న రేవంత్ పుష్ప స్టైల్ లో "ఏమైనా కానీ... ఎవ్వరైనా నామినేట్ చేయనీ.. నీ యవ్వ తగ్గేదేలే.. " అంటూ డైలాగ్ పేల్చి పుష్పలో అల్లు అర్జున్ లాగా నడుచుకుంటూ వస్తాడు. దీనితో అచ్చం పుష్ప లా కనిపిస్తాడు. అలా బిగ్ బాస్ లో పుష్ప దర్సనమిచ్చాడు... ఈ పోజ్ రేవంత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: