టీవీ: బుల్లితెరపై సుధీర్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అతనేనా..?

Divya
ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుదీర్ ఎంతటి పాపులారిటీ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై సూపర్ స్టార్ గా సుడిగాలి సుదీర్ పేరు సంపాదించడమే కాకుండా ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది.బుల్లితెరపై సుధీర్ కనిపించడం లేదు కేవలం వెండితెరపైనే పలు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో బుల్లితెరపై మళ్ళీ సుదీర్ కనిపిస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు.

జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర కార్యక్రమాలను చేసుకుంటూ చాలా హాయిగా ఉండే సుదీర్ ని.. ఎవరు స్టార్ మా లో కి వెళ్ళమన్నారు అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు. అయితే లేనిపోని ఊహలు అందించి సుదీర్ ని రెచ్చగొట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని మానిపించడంతోపాటు జబర్దస్త్ నుంచి దూరం చేశారని వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు కారణం ఓంకార్ అన్నయ్య అనే పేరు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో స్టార్స్ కార్యక్రమాన్ని స్టార్ మా కోసం ఓంకార్ నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమం కోసమే సుదీర్ తో పాటు మరి కొంతమంది జబర్దస్త్ కమెడియన్లను కూడా ఓంకార్ తన ప్రొడక్షన్ హౌస్ లోకి తీసుకు వచ్చినట్లుగా సమాచారం.

ఇక అంతే కాకుండా సుధీర్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు ఇతరత్న కారణాలవల్ల చాలామంది కమెడియన్స్ అటువైపుగా వెళ్లారు తీరా అటు వెళ్లిన తర్వాత ఎంతోమంది స్టార్ కమెడియన్ కెరీర్  సందిగ్ధం పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ షోలు ఎత్తివేయడంతో ఏమాత్రం అవకాశాలు లేకుండా చేశారని  బుల్లితెర వర్గాల ప్రేక్షకులు తెలియజేస్తూ ఉంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సైతం ఖాళీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆహాలో ప్రసారమయ్యే కామెడీ షోలు నటించబోతున్నట్లు సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: