బిగ్ బాస్ 6: "షానీ & అభినయశ్రీ" ల గతే వారికి కూడా ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 6 లో రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. అయితే ఇంతకు ముందు ఏ సీజన్ లో జరగని విధంగా ఇంటి సభ్యులలో కొందరు ఆడుతున్న తీరు ఇంట్లో వారిని మరియు చూస్తున్న ప్రేక్షకులకు సైతం విసుగు తెప్పిస్తున్నారు. ఇదే విషయాన్ని శనివారం హోస్ట్ నాగార్జున ప్రస్తావించి హౌస్ లో భారంగా ఉన్న 9 మంది ఇంటి సభ్యులను గట్టిగా మందలించాడు. కాగా ఈ తొమ్మిది మందిలో నుండి ఇంటిలో ఉండడానికి అర్హత లేని ఒకరిని ఇంటి సభ్యుల ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడం అందరికీ షాక్ అని చెప్పాలి. పైగా ఈ ఎలిమినేషన్ లో షానీ సాల్మన్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోవడం జరిగింది.
అంటే... బాగా ఆడని వారిలో నుండి ఒక్కరు ఎలిమినేట్ అయిపోయారు. కాగా తర్వాత రోజు ప్రేక్షకులు వేసిన ఓట్లు ఆధారంగా అభినయశ్రీ కూడా ఇంటి నుండి బయటకు వెళ్లడం జరిగింది. ఇక ఈ డబల్ ఎలిమినేషన్ తో ఇక ఇంట్లో ఉన్న 19 మంది ఇంటి సభ్యులలో దడ మొదలైంది. ముఖ్యంగా నాగార్జున నిర్ణయించిన వేస్ట్ కంటెస్టెంట్ లకు అయితే ఇంకా ఎక్కువ టెన్షన్ గా ఉంటుందని చెప్పగలము. పైగా వారంతా కూడా సరిగా ఆడకపోవడం వలెనే నాగార్జున చేత మందలించబడ్డారు. కాగా ఈ వారం వారికి దొరికిన మరో చక్కని అవకాశం.
అసలే ఈ రోజు ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్ జరగనున్నందున ఏ విధంగా తమ స్ట్రాటజీలను చూపుతారు అన్న విషయం గురించి ఇంట్లో ఉన్న సభ్యుల ఫ్యాన్స్ ఎంతగానో ఆలోచిస్తున్నారు. ఇక ఇంట్లో ఉన్న ప్రతిక్షణం తెలివిగా చురుకుగా ఉండకపోతే షానీ మరియు అభినయ్ శ్రీ ల లాగా ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. కాబట్టి ఇంటి సభ్యులు అంత ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రదర్శన చెయ్యాలని ఆశిద్దాం.

     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: