యూట్యూబర్ "గలాటా గీతు" చేస్తోంది కరెక్టా ?

VAMSI
మా టీవిలో గత వారం రోజుల నుండి ప్రతిరోజూ రాత్రి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇప్పటి వరకు 5 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరవ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఇప్పుడిప్పుడే హౌస్ లో అలజడి మొదలవుతోంద్. గ్రూప్ లు కూడా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతోంది. కానీ ఇంకా ఎవరు ఏ గ్రూప్ లో ఉన్నారు అన్నది స్పష్టం కాలేదు. వారంలో ఆరు రోజులు కలిసి మెలిసి గేమ్స్ ఆడుతూ తిరిగే హౌస్ మేట్స్ కాస్త, సోమవారం వస్తే చాలు ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయడానికి కారణాలను వెతుక్కుంటారు. అదే విధంగా గత రాత్రి కూడా రెండవ వారానికి సంబంధించిన నామినేషన్ జరిగింది. ఇందులో గలాటా గీతు బాగా హైలైట్ అయింది.
అయితే ఈ గలాటా గీతు వచ్చిన రోజు నుండి తనదైన సహజమైన మాట తీరుతో అటు ఇంట్లో వాళ్ళను మరియు షో చూస్తున్న వాళ్ళను బాగా విసిగిస్తోంది అని విమర్శలు వినిపిస్తున్నాయి. తన మనసులో ఎదుటి వారిని బాధ పెట్టాలన్న ఇంటెన్షన్ లేకపోయినా కానీ ఆ విషయం మాట పడే వారికి తెలియదు. ఇంట్లో తాను ఉన్న ప్రతి క్షణం తన మాటల ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇంపాక్ట్... ఇంతవరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ లలో ఇలాంటి వారు లేరనే బయట టాక్ వినిపిస్తోంది. అయితే ఎందుకు అందరి హౌస్ మేట్ లలాగా గీతు ఉండలేకుంది. పైగా తాను వాడే భాష కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటోంది.
మాములుగా మనము మన సొంత ఇంట్లో అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చు... కానీ కోట్లమంది చూస్తున్న ఒక రియాలిటీ షోలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరికీ నచ్చకపోవచ్చు. అయితే ఈ విషయం గీతు కు తెలిసి చేస్తోందా తెలియక చేస్తోందా అన్నది పక్కన పెడితే ఎంత మాత్రం కరెక్ట్ కాదు అన్నది చాలా మంది అభిప్రాయం. మరి ఇకనైనా ఈ తరహా వైఖరిని మార్చుకుంటుందా అన్నది చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: