బిగ్ బాస్ 6: ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్... నామినేషన్ లో ఉన్నది వీరే?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు స్టార్ట్ అయ్యి ఒక వారం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. అయితే గడిచిన ఈ ఒక్క వారంలోనే ఎన్నో జ్ఞాపకాలు, గొడవలు, మధురానుభూతులు ప్రేక్షకులకు మిగల్చడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు కూడా ఆస్వాదించారు. కాగా నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు. అయితే ఇది పెద్ద షాక్ కాదనే చెప్పాలి.. ఎందుకంటే ఇంట్లో సభ్యులు ఉన్నదీ కేవలం ఒక వారమే కాబట్టి కుదురుకుకోవడానికి టైం ఇచ్చారు బిగ్ బాస్. దీనితో ఒక వారం ఎటువంటి ఇబంది లేకుండా గడిచిపోయింది.
ఇక ఈ రోజు గత సీజన్ ల మాదిరిగానే ఎలిమినేషన్ కు నామినేషన్ జరగనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ అభిమానుల దృష్టి ఈ రోజు ఎపిసోడ్ మీద ఉంది. గత వారం ఎలిమినేషన్ నుండి నామినేట్ అయిన వారికి ఈ వారం ఖచ్చితంగా వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అంతే కాకుండా వారిపై మరింత బాధ్యత ఉంటుంది.. గత వారంలో ఇంట్లో చేసిన పొరపాట్ల నుండి మారి తాము ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా బిగ్ బాస్ ఈ రోజు నామినేషన్ గురించి ఒక ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా రేవంత్ మరియు కీర్తి భట్ లు, ఆదిరెడ్డి మరియు ఆరోహి ల మధ్యన మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వారం ఒక్కొక్కరు ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించినట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా నామినేషన్ ప్రక్రియ జరుగగా... ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి మెరీనా రోహిత్, గలాటా గీతు, రేవంత్, ఆదిరెడ్డి, రాజశేఖర్, అభినయ శ్రీ, పైమా, షానీ సాల్మన్ లు ఉన్నారట. కాగా ఈ వారం మరో ట్విస్ట్ ను కూడా బిగ్ బాస్ ఇవ్వనున్నట్లు వార్తలు అందుతున్నాయి. గత వారం ఎలిమినేషన్ జరగనునందున ఈ వారం హౌస్ నుండి ఇద్దరినీ బయటకు పంపుతారట. మరి నామినేట్ అయిన వారిలో ఏ ఇద్దరు హౌస్ నుండి బయటకు వెళ్లనున్నారో అని అంతా ఆసక్తిగా ఉన్నారు. మరి ఆ వివరాలు తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: