అందుకే బిగ్ బాస్ ఉదయభానును పక్కకు పెట్టారా..?

Divya
వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఎట్టకేలకు ఆరవ సీజన్ ను మొదలు పెట్టేసింది. ఇక చాలా గ్రాండ్గా ఆదివారం సాయంత్రం స్టార్ మా చానల్లో ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి డిఫరెంట్ గా హౌస్ ను ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా ఇందులో 21 నుండి కంటెస్టెంట్లను తీసుకొచ్చి వారి చేత ఆటల పోటీలు పెట్టిస్తున్నారు బిగ్ బాస్. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో ఫైనల్ చేయకముందునే ఎంతోమంది పేర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అలాంటి వారిలో ఉదయభాను పేరు కూడా ఒకటి.

ప్రముఖ నటిగా,  యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఉదయభాను పలు సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ మరింతగా తనను తాను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.  ఇక ఆ క్రేజీతోనే బిగ్ బాస్ 6 కోసం కంటెస్టెంట్ గా ఉదయభానును నిర్వాహకులు సంప్రదించారట.  అయితే ఉదయభాను ఏకంగా వారానికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. కానీ ఉదయభాను డిమాండ్ కు ఒప్పుకోని నిర్వాహకులు బిగ్బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా తీసుకురావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అభిమానుల ఆశలన్నీ నిరాశలయ్యాయని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్లో జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి తో పాటు ప్రముఖ సింగర్ రేవంత్ లకు వారానికి 4 లక్షల రూపాయలు ఇస్తూ వారిని బిగ్ బాస్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే . మరి ఉదయభాను రేంజ్ కూడా అంతకంటే ఎక్కువ ఉంది కదా? మరి ఆమెకు ఎందుకు ఈ పారితోషకం ఇవ్వలేదు ? అంటూ ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉదయభాను మాత్రం ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది అంటూ పలు రకాల భిన్నాభిప్రాయాలను వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: