టీవీ: చమ్మక్ చంద్ర కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
బుల్లితెరపై చమ్మక్ చంద్ర పేరు ఎంత పాపులారిటీ ఉందో మనకు తెలిసిన విషయమే. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చమ్మక్ చంద్ర పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించారు. అలా ఎన్నో చిత్రాలలో కూడా నటించారు చమ్మక్ చంద్ర కానీ జబర్దస్త్ లో చమ్మక్ చంద్రకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. చమ్మక్ చంద్ర చేసే ప్రతి స్కిట్ కూడా ఎంతో అద్భుతంగా ఉండేది. అందుచేతనే నాగబాబుకు అత్యంత ప్రియమైన శిష్యుడుగా మారిపోయాడు. అతి తక్కువ కాలంలోనే చమ్మక్ చంద్ర స్టార్ పొజిషన్లోకి మారిపోయారు.
అలా బుల్లితెరపై చమ్మక్ చంద్ర క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. ఆ తరువాత నాగబాబు జబర్దస్త్ ను విడిపోయిన తర్వాత.. చంద్ర కూడా జబర్దస్త్ విడిచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇతర ఛానల్లో అదిరింది, బొమ్మ అదిరింది వంటి షోలలో చేశారు. చమ్మక్ చంద్ర కు వరుసగా సినిమా ఆఫర్లు రావడానికి ప్రస్తుతం ఎక్కువగా ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే చమ్మక్ చంద్ర ఇండస్ట్రీలోకి రాకముందు తను పడ్డ కష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చమ్మక్ చంద్ర తను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు తన బాబాయి తో రూ.1800 సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చారట. ఆ డబ్బుతో ఒక ఇన్స్టిట్యూట్లో చేరడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్లోనే ధనరాజ్ కూడా చేరాడు. అలా వీరిద్దరూ అప్పటినుంచి మంచి స్నేహితులుగా మారిపోయారు. అంతేకాకుండా హైదరాబాదులో నివసించేందుకు తన స్నేహితులతో కలిసి ఒక రూములో ఉండగా.. తన దగ్గర రూమ్ రెంటు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో ఒక నటుడు దగ్గర వంట మనిషిగా కూడా పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత అక్కడ వచ్చిన డబ్బుతో చమ్మక్ చంద్ర బయటికి రావడం జరిగింది. కానీ అలా వచ్చిన తర్వాత ఎన్నో రోజులు తన నిద్రలేని రాత్రులు, భోజనం చేయని రోజులు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అలా ఒకసారి ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమా ఆడియో ఫంక్షన్ లో అవకాశం రావడంతో అక్కడ తన నటనని ప్రదర్శించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు ఆ తరువాత మల్లెమాలవారు ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నారని తెలుసుకొని అక్కడికి ఎంట్రీ ఇవ్వగా అప్పటినుంచి చమ్మక్ చంద్ర కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: