నవ్వుతూ ఉండే యాంకర్ సుమ లైఫ్ లో అంత వేదన ఉందా ?

VAMSI
జీవితం అన్నాక సంతోషం , దుఃఖం రెండూ సహజమే. చెట్టుకి తగ్గ గాలి అని ధనవంతుడైనా, పేదవాడైనా,
సెలబ్రిటీ అయినా, సామాన్యుడు అయినా వారి వారి జీవితాల్లో ఒడిదుడుకులు, కష్ట సుఖాలు అనేవి ఉండనే ఉంటాయి. అయితే సెలబ్రిటీ జీవితం కాస్త భిన్నంగా ఉంటాయనే చెప్పాలి. ఎందుకంటే వారి లైఫ్ లో ఎన్ని బాధలు ఉన్నా వన్స్ కెమెరా ఆన్ అయ్యాక సీన్ కి తగ్గ ఎక్సప్రెషన్ తో రెడీ గా ఉంటారు, ఉండాలి కూడా, అలాగే ఎప్పుడూ ఎంతో చలాకీగా కనిపించే యాంకర్ సుమ లైఫ్ లో కూడా బాధ కలిగించే అంశాలు ఉన్నాయని మీకు తెలుసా..!!
ఆమె ఒక విషయం గురించి కన్నీరు పెట్టుకోని రోజే ఉండదట. అవును తనకు అత్తమామలు అంటే చాలా ఇష్టం. ఇటీవల సుమ కనకాల అత్తమామలు ఇద్దర్నీ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ముఖ్యంగా తన అత్తగారి ఫోటోను చూసి ఏడవని మరియు బాధపడని రోజే లేదని, ఇది తనకు తీరని, మరువలేని బాదని చెబుతూ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఎపుడు నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఎంతో హుషారుగా కనిపించే సుమ కనకాల ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అనే విషయం తెలిసి అభిమానులు విచారిస్తున్నారు.
గతంలో కూడా సుమ కనకాల తన జీవితం లో బాధించిన ఒక సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు. తన కుమార్తె ఓ వైపు హై ఫీవర్ తో  బాధపడుతుంటే మరో వైపు చిరునవ్వుతో స్టేజ్ ఎక్కి యాంకరింగ్ చేయాల్సిన విషయాన్ని తెలిపారు. కాగా ఇటీవల సుమ కనకాల సొంతంగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఛానల్ లో తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ విషయాలను ఎక్కువగా షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు సుమ కనకాల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: