'కార్తీకదీపం' మోనితా ఇప్పుడు ఏమి చేస్తోందో తెలుసా ?
ఈమెకి యుట్యూబ్ లో అకౌంట్ ఉన్న విషయం తెలిసిందే. అందులో తరచి కొత్త కొత్త పోస్ట్ లు పెడుతూ నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది శోభ. ఇక ఈమె తాజాగా కార్తీక దీపం సీరియల్ లో ఆదిత్య పాత్ర చేసిన యశ్వంత్ కు బర్త్డే విషెస్ చెప్తూ ఒక పోస్ట్ చేసింది. దాంతో ఇపుడు వీరిద్దరి గురించి మరోసారి ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. అతడితో కలిసున్న ఫోటోను అతడి బర్త్డే సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన శోబా శెట్టి అతడికి ఇలా విషెస్ తెలిపింది. నా ఈ చిన్న జీవితానికి బెస్ట్ ఫ్రెండ్ అయిన .. ఎంతో గొప్ప వ్యక్తి..నీకు హ్యాపీ బర్త్ డే.. జీవితంలో నీకు అంతా మంచే జరగాలి అని కోరుకుంటున్నాను అంటూ హ్యాపీ బర్త్ డే చెప్పగా వీరు మళ్ళీ ఫోకస్ అయ్యారు.
గతం లో యూట్యూబ్లో వీరిద్దరి సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాలా ....కార్తీక దీపం సీరియల్ లో వీరి పాత్రలు కొనసాగుతున్న తరుణం లోనే వీరు కలిసి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక శోభ తన సొంత ఖర్చులతో చేసిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో వీరిద్దరూ రొమాన్స్ పీక్స్ కి చేరడంతో నెటిజన్లు అదేంటి సీరియల్ లో ఆదిత్యకి వదిన వరస అయ్యే మోనిత ఇలా ఇక్కడేమో ఇలాంటి వీడియోలలో అంటూ ట్రోల్ చేశారు. అయినా తగ్గేది లే అంటూ వీరి తమ పాటికి తాము ఉన్నారు. అప్పట్లో శోభా శెట్టి యశ్వంత్ హోం టూర్ కూడా చేసి సందడి చేసింది. ఇక ఇపుడేమో బర్త్డే విషెస్ చెబుతూ ఇలా.... మరోసారి నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.