టీవీ: ఇంతకంటే దరిద్రం ఏముంది అంటూ ఫైర్ అయిన రష్మీ.. పోస్ట్ వైరల్..!!

Divya
జబర్దస్త్ యాంకర్ రష్మీ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ షోకి రష్మి మాటలు కట్టి పడేసే అంతగా ఎట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక ఈమె కు తోడుగా సుడిగాలి సుధీర్ తో చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఇక జబర్దస్త్ షో కోసం ఆమె గ్లామర్ ఫోటో షూట్ లో కూడా చేస్తూ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. తరచూ ఆమె అభిమానుల కోసం గ్లామర్ షో ని చేస్తూ ఉంటుంది.

ఇటీవల ఆమె జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా ఈమె హోస్ట్ గా వ్యవహరిస్తోంది. సుడిగాలి సుదీర్ సినిమాల్లో బిజీగా ఉండడం చేత ఆ బాధ్యతలను తీసుకున్నది. ఇక రష్మీ వచ్చాక ఈ షో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ షో లో రష్మీ వేసే పంచులు, రష్మి ఇచ్చే సడన్ షాక్ లు హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక రష్మి క్యూట్ స్మైల్, పాజిటివ్ ఎనర్జీ హాట్ అందాలతో ఎప్పుడు ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇక రష్మీ  అడపదడప సినిమాలలో నటిస్తూ ఉన్నది.

అయితే రష్మి ఏదైనా జంతువుల పై హింస చేశారంటే చాలు ఆమె కోపానికి గురవుతూ ఉంటుంది. ఇక జంతువులకు ఏమైనా అయితే తట్టుకోలేదు రష్మి మరీ ముఖ్యంగా కుక్కల పై అమితమైన ప్రేమ ని చూపిస్తూ ఉంటుంది ప్రతిరోజు నిర్లక్ష్యానికి గురైన కుక్కల ఫోటోలను హింసకు గురవుతున్న జంతువుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ ఫోటోని పంచుకుంటూ ఆగ్రహంతో ఉన్నట్లు ఒక ఫోటో పెట్టింది ఇంతకంటే దరిద్రం ఏముంది అంటూ మండిపడుతోంది. ఇందులో ఒక ఆవును తాడుతో లాక్కెళ్తూ బలవంతంగా తన ఇంటికి వెళ్తున్న వీడియోని షేర్ చేసింది. గోమాత అని పిలిచే ఇండియాలో ఇంతకంటే దరిద్రం ఉండదు జంతు చర్మంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసే ముందు కాస్త ఆలోచించండి అని తెలియజేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: