టీవీ: అందరి ముందే అనసూయని ఆంటీ అనడంతో షాక్ లో అనసూయ..!!

Divya
అనసూయ బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. అనసూయ అందాలకు అందరు ఫిదా అవ్వాల్సిందే అన్నట్టుగా ఆమె వ్యవహరిస్తూ ఉంటుంది. అనసూయ తాజాగా తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా అనసూయ హవా నే బాగా అన్ని చానల్లో కొనసాగుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎక్కువగా ఈటీవీ లోనే కనిపించే అనసూయ ఇప్పుడు తాజాగా జెమిని, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని ఛానల్ లోకి ఎంట్రీ ఇస్తోంది.
కానీ అనసూయ పేరు తెచ్చిపెట్టింది మాత్రం జబర్దస్త్ షో అని చెప్పవచ్చు ఈటీవీ లో చేసే పండుగ ఈవెంట్ మాత్రం అనసూయ ఈ మధ్య కాలంలో కాస్త దూరంగా ఉంటోంది. ఇలాంటి సమయాలలో ఆమె ఇతర చానల్లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటోంది.. ఇప్పుడు తాజాగా అనసూయ స్టార్ మా లో ఒక కొత్త ప్రోగ్రామ్ కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈమెతో పాటు సుధీర్ కూడా కనిపించబోతున్నారు. స్టార్ మాలో తాజాగా సూపర్ సింగర్ జూనియర్ అంటూ వచ్చిన చిన్న పిల్లల పాటల కార్యక్రమంలో వీరిద్దరూ కనిపించబోతున్నారు.

ఈ షో లో మనో , ఉష ఉత్తప్, రెనీనా రెడ్డి, చిత్ర, హేమచంద్ర వంటి వారు కూడా కనిపించబోతున్నారు. అయితే ఈ షోకు వస్తున్న పిల్లలు మాత్రం దుమ్ము దులిపే లాగా కనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో చిచ్చర పిడుగులు ఉన్నారు. ఇక ఇందులోని ప్రతి ఒక్క పిల్లలు కూడా అనసూయ దారుణంగా ఆడేసుకుంటున్నారు. దీంతో కొంతమంది పిల్లలు అనసూయని ఏకంగా ఆంటీ అనేసారు. దీంతో అనసూయ కాస్త డల్ నెస్ కనిపించింది
కానీ సుధీర్ ని మాత్రం అన్నా అన్నా అంటూ పిలుస్తున్నారు. ఇక అనసూయ డాన్స్ వేయడంతో ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఒక బుడ్డోడు అనసూయ కోతిలా ఎగురుతోంది ఏంటి అంటూ పరువు తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: