టీవీ: ఈ వివాదంపై నోరు విప్పిన నిహారిక..!!

Divya
ఈ మధ్య కాలంలో పలు వివాదాలపై మెగా కూతురు నిహారిక తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంది. వెబ్ మీడియా, సోషల్ మీడియాలో నిహారిక గురించి పలు రకాలుగా ట్రో ల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నిహారిక సైతం ఈ వివాదాలకు మీడియాకు గత కొంతకాలంగా దూరంగానే ఉన్నది. అయితే తాజాగా మదర్స్ డే సందర్భంగా ఒక న్యూస్ ఛానల్ కి నిహారిక తల్లి పద్మజ, నిహారిక ఇంటర్వ్యూ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూలో పద్మజా , నిహారిక ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం జరిగింది.
నిహారిక పై వచ్చిన వార్తల్లో.. ఆ సమయంలో మొదట కాస్త బాధగా అనిపించింది అని ఆమె తెలియజేసింది. మాకున్న దానిలో ఎవరు ఏమి చేయలేరు అని అలా అంటే మేము పడవలసిన పని లేదని ఆమె తెలియజేసింది. తప్పు చేయని పక్షంలో బాధపడాల్సిన పని లేదని ఆమె తెలియజేసింది. నిహారిక ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా అన్నా.. బాధ గా అనిపించినా ఆ సందర్భం ఏంటో మాకు తెలుసునని ఆమె తెలియజేసింది. అయితే ఎవరైనా బాగున్నారు అంటే చాలు వాళ్ళ పైన రాయి వేయాలని ఎంతోమంది చూస్తూ ఉంటారు అని తెలియజేసింది.
ఇక తమ బావగారు ఉన్నంతవరకు మాకేమి పర్వాలేదని పద్మజ తెలియజేసింది. ఇక నిహారిక భర్త కూడా ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి కావడం మాకు ఆనందంగా ఉందని పద్మజ తెలియజేసింది. అయితే నీహారిక పై వచ్చిన వార్తల గురించి నిహారిక స్పందిస్తూ తాను ఇలాంటి వార్తలను అసలు పట్టించుకోనని కామెంట్స్ చేసింది. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ తాను అసలు పట్టించుకోనని.. ఇంస్టాగ్రామ్ లో వచ్చిన కామెంట్లను అసలు పట్టించుకోలేదని ఆమె తెలియజేసింది. తన పైన ఎలాంటి విషయాలు రాసుకున్నా కూడా తనకి మాత్రం  అలాంటి విషయాలు అక్కర్లేదని తెలియజేసింది. అయితే ఇలాంటి విషయాలు తన దగ్గరకు వచ్చి చెప్తే వారిని కొట్టేస్తాం అని తెలియజేసింది నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: