టీవీ: నటి ప్రేమతో అందరి ముందు రొమాన్స్ చేసిన హీరో.!!

Divya
బుల్లి తెరపై ప్రసారమౌతున్న ఎన్నో కార్యక్రమాలలో యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రామ్ కూడా ఒకటి. ఇక ప్రతి వారము ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తు ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఈ వారం సుమ క్యాష్ ప్రోగ్రామ్ కి హీరో వెంకట్, హీరోయిన్ ప్రేమ, హీరో పృద్వి, రోహిత్ వంటివారు హాజరు కావడం జరిగింది. అయితే తాజాగా వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదలైంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. సుమ తో కలిసి వీళ్ళందరూ పంచ్ డైలాగులు వేయడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా సందడి చేశారు.

ఇకపోతే ఇప్పుడు ఒక  టాస్క్ లో భాగంగా సుమ వీరికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా హీరోయిన్ ప్రేమ కూరగాయలు కోస్తున్న సమయంలో వేలు తెగితే.. నువ్వు హీరో అయితే ఎలా చేస్తావు అంటూ వెంకట్ ని అడగగా.. అప్పుడు వెంకట్ తన వేలిని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ .. ఆమెతో రొమాన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇక అటు తర్వాత పృద్వి హర్రర్ గా చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాడు.
ఇక ఇదే తరహాలో హీరో రోహిత్ కూడా ఫ్యాక్షన్ తరహాలో ఆ సన్నివేశాన్ని చూపించి ఆశ్చర్యపరిచారు. ఇక ఈ క్రమంలోనే సుమ ఒక్కొక్కరిని ఒక ప్రశ్నలడుగుతూ వస్తోంది. ఇక ఈ ప్రోమోలో చూపించిన విధంగా పృద్వి నాగార్జున అంటే చాలా ఇష్టం అని తెలియజేశారు. నాగార్జున కనుక అమ్మాయి గా పుట్టి ఉంటే అతడిని తప్పకుండా తను వివాహం చేసుకునే వాడిని అని తెలియ జేశాడు పృథ్వి. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో చాలా ట్రెండీగా మారుతోంది. ఇక అంతే కాకుండా వీటితో పాటు వీరు పడ్డ కష్టాలను కూడా తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: