బిగ్ బాస్ 6 : ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది వీరే?

VAMSI
తెలుగు బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఎంతగానో కవ్వించినా ఈ టెలివిజన్ ప్రోగ్రాం ఇపుడు బుల్లి తెరపై ప్రసారం కాకపోవడంతో టెలివిజన్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ బిగ్ బాస్ షో ని ఎలాగైనా  మిస్స్ కాకుండా చూడాలి అనుకునే బిగ్ బాస్ ప్రేమికులు మాత్రం హాట్ స్టార్ లో ఈ షో ను రెగ్యులర్ గా చూస్తూ షో ని ఎంజాయ్ చేస్తున్నారు. మొదటి అయిదు సీజన్ లను టెలివిజన్ లో ప్రసారం చేసి వరుస విజయాలను అందుకున్న ఈ షో ఇపుడు అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది అని చెప్పలేము. కానీ క్రేజ్ మాత్రం తగ్గకుండా చూసుకుంటూ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఓటీటీ వెర్షన్‌లోనూ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్‌ను కూడా ఆసక్తికరంగా  సాగుతోందనే చెప్పాలి. దాదాపుగా చాలా మంది గడిచిన సీజన్ లలో అలరించినవారే ఉన్నారు.  ప్రస్తుతం హౌజ్ లో ఆరో వారం ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. కాగా హౌజ్మెట్స్ సందడి ఎలా ఉంది..?? ఈసారి  ఎలిమినేట్ లిస్ట్ లో ఎవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి? అనే వివరాలు తెలుసుకుందాం పదండి...!!
ఈ సీజన్‌లోకి ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, అషు రెడ్డి, మహేశ్ విట్టా,  ఆరియానా గ్లోరీ,  యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, సార్థక్‌లు ఇంటి సభ్యులు గా ఉన్నారు. వీళ్లలో నుండి ఆరోవారం నామినేషన్ లో మహేష్ విట్టా, అషు రెడ్డి, అజయ్, స్రవంతి, హమీదా, బిందు మాధవి, మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ,  ముమైత్ ఖాన్‌లు ఉన్నారు. కాగా ఈ వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ముమైత్ ఖాన్ ఓటింగ్ లో చివరి స్థానం లో కొనసాగుతోందని తెలుస్తోంది.. ఆ తర్వాత లిస్ట్ లో స్రవంతి  పేరు గట్టిగా వినపడుతోంది. కాబట్టి ఈ వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: