టీవీ: సీరియల్స్ లేక గోవా చేరిపోయిన డాక్టర్ బాబు..!!

Divya
బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు.. తెలుగు సీరియల్ లో ఇప్పటివరకు ఉన్న సీరియల్ లో ఈ సీరియల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ సీరియల్ కు లేదని చెప్పవచ్చు. ఇక ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ ని చూడడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఇక కార్తీక్, దీప, సౌందర్య, మౌనిక పాత్రలకు వీర అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరి గురించి ఎటువంటి వార్త వచ్చినా సరే నెట్టింట్లో వైరల్ గానే ఉంటుంది.
ఇందులో ఎక్కువగా డాక్టర్ బాబు వంటలక్క పాత్రలకు విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఈ సీరియల్ తో బుల్లితెర స్టార్ గా మారిపోయారు డాక్టర్ బాబు. ఇక ఇతని అసలు పేరు నిరుపమ్. ఈయన తండ్రి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి గొప్ప నటుడే. ప్రస్తుతం డాక్టర్ బాబు హిట్లర్ గారి పెళ్ళాం అని మరొక సీరియల్ లో నటిస్తున్నారు. ఇక ఇందులో కూడా మంచి నటన కలవడంతో ప్రేక్షకుల్లో మరింత పెరిగారు. ఈయన భార్య కూడా నటి మంజుల. ఈమె కూడా కొన్ని సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంది.
వీరిరువురికీ ఒక బాబు కూడా ఉన్నారు. నిరుపమ్. కార్తీకదీపం సీరియల్ కంటే ఎన్నో నాటికల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ కార్తీకదీపం సీరియల్ ఈ యన కెరీర్ని మలుపు తిప్పింది అని చెప్పవచ్చు.. ఈ సీరియల్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వెండితెరపై కనిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు గా తెలుస్తోంది. అప్పుడప్పుడు కేవలం బుల్లితెర పై జరిగే కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలోనే తన భార్య పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక తన ఫ్యామిలీతో కలిసి గోవా కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది నిరుపమ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: