టీవీ: ఫస్ట్ వీక్ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవుతున్నది ఎవరంటే..?

Divya
తాజాగా బిగ్ బాస్ -6 టెలికాస్ట్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇక ఇందులో గతంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ సైతం పాల్గొనడం జరిగింది. అందులో ఆరియనా గ్లోరి, ముమైత్ ఖాన్, సరయు, నటరాజన్ మాస్టర్, ఆర్జే చైతు వీరందరూ నామినేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఇక నటరాజన్ మాస్టర్ ని అందులో ఉన్న వారంతా టార్గెట్ చేస్తూ ఆయన మెడలో బోర్డులు వేయడంతో ఈయన తొలి వారం నామినేషన్ ప్రక్రియ ప్రస్తుతం చాలా రచ్చరచ్చగా మారుతోంది. ఇక గత సీజన్లో నటరాజు మాస్టర్ కూడా ఎలా ఉన్నారో అలాగే ఇక్కడ కూడా ఈ సీజన్లో ఉన్నారు.
ఇక ఇతని ప్రవర్తనతో అక్కడున్న వారియర్స్ కంటెస్టెంట్ లు రగిలిపోతున్నారట. ఇక R.J చైతు ను బాడీ షేమింగ్ చేసినట్లుగా పేర్కొన్నాడు. కానీ ఈ విషయంలో మాత్రం నటరాజ్ మాస్టర్ అస్సలు ఒప్పుకోలేదు.. ఇక ఇందులో ప్రతి ఒక్కరు కూడా నటరాజు మాస్టర్ ని టార్గెట్ చేస్తున్నారు. వాస్తవానికి నామినేషన్ లో స్రవంతి కాస్త అతిగానే చేసినట్లుగా కనిపిస్తుంది.. ఉన్న విషయాన్ని చెబితే సరిపోతుంది కానీ మరి అంత అతి అవసరం లేదంటున్నారు చేసిన వారంతా. ఇక ఈ వారం నామినేషన్లను మొత్తం ఏడు మంది ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నది.
ఆరియానా వంటి వారు ఈ మొదటి నామినేషన్లు ఉండడం పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.. ఇక మొత్తం అంతా  కంటెస్టెంట్ లు ఉంటే ఓట్లు పడవని ఉద్దేశంతోనే ఈ మొదటి ఎలిమినేషన్లో ఆరియానా ను ఓటింగ్ లో ఉచిత ఓటు శాతం పెరగవచ్చని ఈ నామినేషన్లు ఉంచినట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతం ఇక వీటితో ఐదు మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. అయితే తొలి వారం ఓటింగ్ ప్రకారం కనుక ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండేది మిత్రశర్మ అన్నట్లుగా సమాచారం. అయితే ఇదంతా కేవలం బిగ్ బాస్ వోటింగ్ మాయ మీద ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: