టీవీ : మనసంతా నువ్వే సీరియల్ దమయంతి రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya

సినిమాలకంటే ఎక్కువ క్రేజ్ ను  సీరియల్స్ సంపాదించుకున్నాయి.. ఎందుకంటే సినిమా అయితే కేవలం మూడు గంటల వినోదం మాత్రమే.. అదే సీరియల్ అయితే రోజు కేవలం 30 నిమిషాలే ప్రసారమైనా  రోజురోజుకు ఉత్కంఠభరితంగా సాగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు ఇంట్లో ఏం జరుగుతుందో అని పట్టించుకోకుండా టీవీ లకే పరిమితం అవుతుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అంతలా మహిళలకు మంచి ఎంటర్టైనర్ గా మారాయి ఈ సీరియల్స్. కరోనా వచ్చిన తర్వాత పురుషులు సైతం సీరియల్స్ కు ఫిదా అయిపోతున్నారు. నిజం చెప్పాలంటే సినిమాల కంటే బాగా ఈ సీరియల్స్  ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ఇటీవల కాలంలో వచ్చిన సీరియల్ మనసంతా నువ్వే.. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా అలరించడం పాటు మంచి స్టోరీ లైన్ తో ముందుకు సాగుతోంది.. ఇక ఇందులో హీరో ఏక్నాథ్ తల్లి గా నటిస్తున్న దమయంతి మనందరికీ సుపరిచితురాలే..ఈమె పేరు నవీన యట..  చీరాలకు చెందిన వారు అయినప్పటికీ తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడిన కుటుంబం.. అయితే చిన్నప్పుడు డాక్టర్ కావాలని కోరుకునే దట నవీన.. అయితే పదవ తరగతి చదువుతున్నప్పుడు చాలా అందంగా క్యూట్ గా ఉండడంతో సినిమాలలో ట్రై చేయమని ఎదురింటి వారు చెప్పడంతో తన ఫోటోలను ఎంతో మంది దర్శకులకు, స్టూడియోలకు పంపించింది. కానీ ప్రతి సారి తిరస్కరించడంతో ఒక దర్శకుడు.. నటన  రాని వాళ్ళు అంతా  ఎందుకు ఇండస్ట్రీకి వస్తారు అని ఆమెను కించపరచారట..

కానీ దర్శకుడు కృష్ణ వంశీ నటనలో వృత్తిని కొనసాగించడానికి బదులు విద్యను పూర్తి చేయమని చెప్పడంతో ఆమె మళ్ళీ వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యింది.అలా ఇంటర్ చదువుతున్న సమయంలో దర్శకుడు శ్రీ రాం బాలాజీ ఈమె ఫోటోలు చూసి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు.. ఇక అలా వీరి వీరి గుమ్మడి పండు , అవునంటే కాదనిలే..వంటి సినిమాలో హీరోయిన్ గా నటించింది.. సినిమాల ద్వారా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడం కష్టమని భావించిన ఈమె ఇంటర్మీడియట్  కొనసాగించింది. ఆ తర్వాత డిగ్రీ చదవాలని ఆలోచనల్లో ఉండగానే దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అలౌకిక అనే సీరియల్లో ప్రధాన పాత్రలో నటించే అవకాశాన్ని ఇచ్చాడు.


ఆ సీరియల్ తో  తనలో ఉన్న నటనను చూపించి.. ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది . తర్వాత వరుస అవకాశాలు ఈమెకు వస్తూనే వుండడం గమనార్హం.. అలా అగ్నిగుండం , మల్లీశ్వరి , త్రిశూలం వంటి  సీరియల్స్ లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన తరువాత  కలవారి కోడళ్ళు,  పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్స్ తో  మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ టీవీ లో ప్రసారమౌతున్న మనసంతా నువ్వే సీరియల్ లో హీరో కి తల్లి పాత్రలో నటిస్తూ మరింత ప్రేక్షకాదరణ చూరగొంటోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: